Sharmila YSRTP merge with Congress? 4న ఢిల్లీకి వైఎస్ షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికేనా!

Share the news

Sharmila YSRTP merge with Congress?

ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నుంచి షర్మిల ఆహ్వానం. ఈ నెల 4న (గురువారం) షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ వైఎస్ షర్మిల (YS Sharmila) తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, సమక్షంలో షర్మిల హస్తం పార్టీలో చేరనున్నారు. ఆమెతో పాటు 40 మంది నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం అందుబాటులోని పార్టీ ముఖ్య నేతలతో షర్మిల సమావేశం అయ్యారు. పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మధ్యాహ్నం కుటుంబ సమేతంగా షర్మిల ఇడుపులపాయకు బయలుదేరనున్నారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ పత్రికను సాయంత్రం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి నివాళి అర్పించనున్నారు. మరికొద్ది సేపట్లో ఇడుపుల పాయలో షర్మిల ప్రకటన చేసే అవకాశం.

Sharmila YSRTP కాంగ్రెస్ లో merge అయితే ..

షర్మిలకు ఏఐసీసీ పదవి లేదా ఏపీ పీసీసీ పదవి దక్కవచ్చు. ఏపీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న ఈ సమయంలో ఏపీ పీసీసీ పదవి దక్కవచ్చు అని భావిస్తున్న విశ్లేషకులు.. రాహుల్ కూడా షర్మిలకు పీసీసీ అధ్యక్ష కట్ట పెట్టడానికే మొగ్గు చూపెడుతున్నాడని వినికిడి.
ఇక Sharmila YSRTP కాంగ్రెస్ లో merge వల్ల కాంగ్రెస్కు రెండు ప్రయోజనాలు. ఒకటి షర్మిల, బ్రదర్ అనిల్ ద్వారా క్రిస్టియన్ ఓటు బ్యాంకు చీల్చి, తమ పార్టీని దెబ్బతీసిన జగన్ ను చావు దెబ్బ కొట్టడం. జగన్ ఓటు బ్యాంకు చీల్చి, తెలంగాణాలో తమకు సహకరించిన బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం రెండవది. ఇక 2019 ఎలక్షన్స్ లో తనని వాడుకుని వదిలేసిన సోదరుడుపై రివెంజ్ తీసుకునే అవకాశం షర్మిలకు దొరికినట్లే.

See also  Malla Reddy: మల్లా రెడ్డి మళ్లీ పార్టీ మారుతుండా?

1 thought on “Sharmila YSRTP merge with Congress? 4న ఢిల్లీకి వైఎస్ షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికేనా!”

  1. Pingback: Sharmila merged YSRTP in Congress: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన షర్మిల - Samachar Now

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top