Ambati Rayudu : పార్టీలో చేరిన 10 రోజులకే రాజీనామా చేసి వైసీపీకి షాక్ ఇచ్చిన అంబటి రాయుడు

Ambati Rayudu : పార్టీలో చేరిన 10 రోజులకే రాజీనామా చేసి వైసీపీకీ షాక్ ఇచ్చిన అంబటి రాయుడు. అసలే సిట్టింగులకు టికెట్ ల నిరాకరణతో పార్టీలో గందరగోళం నెలకుంది. పులి మీద పుట్రలా ఇప్పుడు రాయుడు రాజీనామా.. దీంతో వైసీపీ కార్యకర్తలలో పూర్తి గందరగోళం. అసలేమీ జరుగుతుందో తెలియని పరిస్థితి.
Share the news
Ambati Rayudu : పార్టీలో చేరిన 10 రోజులకే రాజీనామా చేసి వైసీపీకి షాక్ ఇచ్చిన అంబటి రాయుడు

Ambati Rayudu, తన బాడ్ లక్ వల్లో లేదా ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలవల్లో కానీ అర్దాంతరంగా క్రికెట్ కెరీర్ ముగించాడు. ఆదిలోనే హంసపాదు లా ఇప్పుడు రాజకీయాల్లో కూడా. సిట్టింగులకే టికెట్ లు నిరాకరస్తూ గందరగోళంలో వున్న పార్టీ లో చేరడమే తప్పు అనుకుంటే ఇప్పుడు 10 రోజులకే రాజీనామా ఏంటో ? జనసేన లాంటి పార్టీ లో చేరి పార్టీ తో పాటు ఎదగాల్సింది. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియకుండా ఎంపీ సీట్ ఆశిస్తూ, ఆల్రెడీ సిట్టింగులకే టికెట్ నిరాకరిస్తున్న పార్టీలో చేరడం తెలివైన నిర్ణయం కాదు.

వైసీపీకి Ambati Rayudu రాజీనామా

వైసీపీ కి ఆ పార్టీ నాయుకులు, సిట్టింగులు షాక్‌ల మీద షాక్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా క్రికెటర్ అంబటి రాయుడు కూడా షాక్ ఇచ్చారు. ఆయన డిసెంబర్‌ 28వ తేదీన పార్టీలో చేరారు. ఇప్పుడు పార్టీలో చేరిన 10 రోజులకే పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. వైసీపీ నుంచి వైదొలగుతున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా అంబటి రాయుడు ప్రకటించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్టు తెలిపారు. ఆ తర్వాత భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తానంటూ వెల్లడించారు.

See also  YCP MP Balashauri met Pawan: పవన్‌తో బాలశౌరి సమావేశం - పార్టీలో చేరికపై చర్చలు!

టికెట్ రాదనుకున్న నేతలు, కొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామాలతో షాక్ లో వున్న వైసీపీకి, పార్టీ పెద్దలకు ఇది మరో షాక్. అవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు Ambati Rayudu రాజీనామా మాత్రం చాలా డిఫరెంట్‌. ఎప్పటి నుంచో ఉన్న నేతలను పార్టీయే వదులుకుందని… జగన్‌ వద్దనుకోవడంతోనే వాళ్లంతా రాజీనామాలు చేస్తున్నారని సమర్థించుకోవచ్చు. కానీ అంబటి రాయుడు రాజీనామాను మాత్రం ఎలా సమర్థించుకుంటారో చూడాలి. కనీసం పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఒక్కసారైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా జాయిన్ అయిన పది రోజులకే ఇలా రాజీనామా చేయడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారుతోంది.

బహుశా లావు శ్రీకృష్ణ దేవరాయులకు గుంటూరు MP స్థానం కేటాయించవచ్చని తెలిసి రాజీనామా చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Also Read News

Scroll to Top