Welspun Investments in TS: తెలంగాణాలో వెల్ స్పాన్ (Welspun ) గ్రూప్ పెట్టుబడులకు సిద్ధం

Welspun Investments: తెలంగాణ రాష్ట్రములో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్‌స్పన్ గ్రూప్‌ (Welspun group)సంసిద్ధత వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.
Share the news
Welspun Investments in TS: తెలంగాణాలో వెల్ స్పాన్ (Welspun ) గ్రూప్ పెట్టుబడులకు సిద్ధం

Welspun Investments: IT సేవలలో రూ.250 కోట్ల పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రములో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్‌స్పన్ గ్రూప్‌ (Welspun group)సంసిద్ధత వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. శనివారం డా.బిఆర్ అంబేడ్కర్ సచివాలయములో వెల్‌స్పాన్ గ్రూప్‌ చైర్మన్ బి.కె. గోయెంకా (BK Goenka) వారి ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Welspun గ్రూప్‌ చైర్మన్ బి.కె. గోయెంకా మాట్లాడుతూ.. తమ కంపెనీ భవిష్యత్తులో చందన్ వ్యాలీ పారిశ్రామిక విభాగంలో ప్రారంభించబడిన IT సేవలలో రూ.250 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పారు. టైర్ 2, 3లలోని ఐటిలను అభివృద్ధిపరిచి ప్రమోట్ చేసేందుకు గాను వికారాబాద్, అదిలాబాద్ జిల్లాల్లోని యువతకు IT ఉద్యోగాలను కల్పించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉన్నదని ఆయన తెలిపారు.

See also  Padma Awardees honored: వెంకయ్య, చిరంజీవి ల చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు గ్రహితలకు నగదు బహుమతి

ఈ సమావేశములో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, స్పెషల్ సెక్రటరీ డాక్టర్ విష్ణు రెడ్డి, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి , వెల్‌స్పాన్ గ్రూప్‌ హెడ్ (కార్పొరేట్ వ్యవహారాలు) చింతన్ థాకర్, శ్రీస భార్గవ మొవ్వ తదితరులు పాల్గొన్నారు.

-By రాంబాబు.C

Also Read News

Scroll to Top