MP Resignations: విజయవాడ ఎంపీ కేశినేని టీడీపీకి.. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా ..

Share the news
MP Resignations: విజయవాడ ఎంపీ కేశినేని టీడీపీకి.. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా ..

MP Resignations: కేశినేని (Kesineni)

సీఎం జగన్ మోహన్ రెడ్డితో(Jagan Mohan Reddy) భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేశినేని కీలక కామెంట్లు చేశారు. టీడీపీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశానని.. రాజీనామా ఆమోదం పొందగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు.
టీడీపీ(TDP) కోసం, ప్రజల కోసం చాలా నిజాయితీగా కష్టపడ్డానని కేశినేని నాని తెలిపారు. ఎంతో మంది చెప్పినా పట్టించుకోకుండా, టీడీపీ పార్టీలోనే కొనసాగానని కేశినేని నాని తెలిపారు. ఇన్ని రోజులు టీడీపీ కోసం, ప్రజల కోసం ఎంత చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అమ్ముకున్న ఆస్తుల విలువ రెండు వేల కోట్లుగా పేర్కొన్నారు. బాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను తన భుజాల మీద మోసినట్టు చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పచ్చి మోసగాడు అని కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని వెంట ఆయన కుమార్తె శ్వేత కూడా ఉన్నారు.

See also  Raa Kadaliraa meeting at Gudivada: టీడీపీ-జనసేన పొత్తు.. జగన్ చిత్తు.. -గుడివాడ సభలో బాబు

MP Resignations: సంజీవ్ కుమార్ (Sanjeev Kumar )

కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి (YCP) రాజీనామా చేశారు. వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదని మండిపడ్డారు. ఇటీవల వైసీపీ అధినాయకత్వం సంజీవ్ కుమార్ ను కర్నూలు పార్లమెంటు స్థానం ఇన్చార్జి పదవి నుంచి తప్పించింది. ఈ కారణంగానే ఆయన మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన నిర్ణయంపై డాక్టర్ సంజీవ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. జగన్‌ను కలవడానికి పోన్ చేస్తే ఎవరూ రిసీవ్ చేసుకోలేదని ఎంపీ సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో అభివృద్ధి పనులు చేయలేకపోయానని విమర్శలు గుప్పించారు. బీసీలకు పెద్దపీట వేస్తామంటారు కానీ.. చేతల్లో ఉండదన్నారు. తన అనుచరులు, మద్దతుదారులు, బంధువర్గంతో చర్చించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఇవాళ ఉదయమే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, ఇంకా ఏ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. మరో 10, 20 ఏళ్లు రాజకీయాల్లో కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పారు. త్వరలో టీడీపీ చేరవచ్చని రాజకీయ విశ్లేషకుల మాట.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top