Prabhas The Raja Saab: ప్రభాస్ – మారుతి సినిమా ‘ది రాజా సాబ్’ ఫస్ట్‌లుక్!

Prabhas The Raja Saab:ప్రభాస్ అభిమానులకు సంక్రాంతి కానుక. ప్రభాస్, మారుతిల కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకి ‘ది రాజా సాబ్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు.
Share the news
Prabhas The Raja Saab: ప్రభాస్ – మారుతి సినిమా ‘ది రాజా సాబ్’   ఫస్ట్‌లుక్!

Prabhas The Raja Saab

ప్రభాస్(Prabhas), మారుతి(Maruthi) కాంబినేషన్‌లో చడీ చప్పుడు కాకుండా తెరకెక్కుతున్న సినిమా గురించి ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌లో కూడా ఎప్పటి నుంచో డిస్కషన్‌ నడుస్తుంది. సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఇప్పుడు మేజర్ అప్డేట్ వచ్చేసింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. దానితో పాటు ఫస్ట్ లుక్ కూడా ఇచ్చి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు.

టైటిల్ The Raja Saab, Catchy గా ఉండి వినగానే బావుంది. ఇక ఫస్ట్ లుక్ సంగతికి వస్తే ప్రభాస్ గత చిత్రాల్లా పవర్‌ఫుల్‌గా కాకుండా బాగా కూల్‌గా, కొత్తగా, కలర్‌ఫుల్‌గా ఉంది. టీ షర్ట్, పూల లుంగీతో పోస్టర్‌లో ప్రభాస్ చాలా కూల్‌గా, స్టైలిష్‌గా ఉన్నారు. ప్రభాస్ హెయిర్‌స్టైల్ కూడా గత చిత్రాలతో పోలిస్తే కొత్తగా ఉంది. మారుతి తన సినిమాల్లో హీరోల లుక్స్‌పై చాలా కేర్ తీసుకుంటారు. ఈ పోస్టర్‌లో అది స్పష్టంగా కనిపిస్తుంది.

See also  Payal Rajput: మా అమ్మ గురించి ప్రార్ధించండి - పాయల్ రాజ్‌పుత్ ! అసలు ఏమైంది?

The Raja Saab సాంకేతిక నిపుణులు

ఇక ‘ది రాజా సాబ్’లో నటిస్తున్న నటీనటుల గురించి ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి ఇంతకముందు. మాళవిక కొన్ని ఇంటర్వ్యూల్లో ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా మరో కీలక పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. సాంకేతిక నిపుణుల పేర్లు మాత్రం పోస్టర్‌లో వేశారు . సంగీత దర్శకుడు గా ఎస్ ఎస్ థమన్, సినిమాటోగ్రాఫర్‌గా కార్తీక్ పళని ఉన్నారు. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు.

ఇక ‘ది రాజా సాబ్’ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు కానీ ఈ సంవత్సరమే విడుదల అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘ది రాజా సాబ్’ ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది.

Also Read News

Scroll to Top