
Janasena New Song Released
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేడి రాజుకుంది. వైసీపీ (Ycp), తెలుగుదేశం(Tdp), జనసేన(Janasena), బీజేపీ (Bjp), కాంగ్రెస్ (Congress ), వామపక్షాలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. ఈ నేపధ్యం లో సంక్రాంతి సంబరాల్లో జనసేన పల్లె పాట అంటూ జనసేన కొత్త పాటను (Janasena New Song) విడుదల చేసింది. “పరశురాముడు వచ్చినాడురో సూడన్న… ప్రజల కొరకు నిలిచినాడురో పవనన్న.. సింహమయి కదిలినాడురో మా యన్న, గాజు గ్లాసుకు ఓటు వెయ్యరో పెద్దన్న” అంటూ సాగే ప్రచార గీతాన్ని ట్విట్టర్ లో పోస్టు చేసింది.
Pawan Kalyan పై జానపద బాణీ లో సాగిన ఈ ప్రచార గీతం సామాన్య జనాన్ని ఇట్టే ఆకట్టుకునేలా వుంది. సమస్యల ప్రస్తావన కూడా అందరికి అర్ధమయ్యేలా సాహిత్యం వుంది. సాహిత్యం, సంగీతము రెండు బాగున్నాయి.
పరశురాముడు వచ్చినాడురో పాట : https://t.co/sAfAgXD4cK@PawanKalyan #HelloAP_ByeByeYCP
— JanaSena Party (@JanaSenaParty) January 15, 2024