HanumaN Box Office Records: నాలుగు అంగల్లో 100 కోట్ల మార్క్ ను దాటిన హనుమాన్!

HanumaN Box Office Records: నాలుగు అంగల్లో 100 కోట్ల మార్క్ ను దాటిన హనుమాన్! విడుదలకు ముందు చిన్న సినిమా అని థియేటర్లు కేటాయించ కుండా హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసిన వారికి ఈ 100 కోట్ల వసూళ్లతో బుద్ది వచ్చేలా చేసిన హనుమాన్.
Share the news
HanumaN Box Office Records: నాలుగు అంగల్లో 100 కోట్ల మార్క్ ను దాటిన హనుమాన్!

HanumaN Box Office Records: World wide

కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక సినిమా భారీ వసూళ్లు రావడంతో వారు ఆనందాన్ని వ్యక్తం చెసారు. విడుదలకు ముందు చిన్న సినిమా అని థియేటర్లు కేటాయించ కుండా హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసిన వారికి ఈ 100 కోట్ల వసూళ్లతో బుద్ది వచ్చేలా చేసిన హనుమాన్.

HanumaN Box Office Records: USA

ఇక ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద హనుమాన్ నమ్మశక్యం కానీ ఫీట్లు చేస్తున్నాడు. USA లో అయితే 4 రోజులకే 3 మిలియన్ డాలర్ల కు పైగా వసూల్ చేసి, చిన్న సినిమాల్లో పెద్ద సినిమాగానే కాకుండా, పెద్ద సినిమాల రికార్డులకు కూడా ఎసరు పెట్టేలా ఉన్నాడు. మహేష్ బాబుకి చాలా బలమైన బేస్ ఉన్న యుఎస్ లో గుంటూరు కారంని ఎప్పుడో వెనక్కు నెట్టేసి ఏకంగా రాజమౌళి రికార్డుల మీద కన్నేస్తున్నాడు. కేవలం నాలుగు రోజులకే 3 మిలియన్ మార్క్ దాటేసి సరికొత్త బెంచ్ మార్కులను నెలకొల్పుతున్నాడు. ప్రస్తుతం హనుమాన్ కన్నా ముందు ఉన్నవాటిని చూస్తే ఆదిపురుష్ 3.16, సాహు 3.23, భరత్ అనే నేను 3.41, రంగస్థలం 3.51, అల వైకుంఠపురములో 3.63, బాహుబలి బిగినింగ్ 8.47, సలార్ 8.90, ఆర్ఆర్ఆర్ 14.83, బాహుబలి కంక్లూజన్ 20.76 మిలియన్లతో ఉన్నాయి. HanumaN Box Office Records ఇలాగే కంటిన్యూ అయితే ఫుల్ రన్ లో హనుమాన్ చాలా సులభంగా టాప్ 5 లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

See also  Sankranti Box Office Report: సంక్రాంతి సినిమాల వారాంతపు వసూళ్లు.. విన్నర్ ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి

ఎందరో టాలీవుడ్ హీరోలకు కలగా మిగిలిపోయిన 3 మిలియన్ మార్క్ ని తేజ సజ్జ ఇంత తేలికగా అందుకోవడం షాకే. ఇది తన ఇమేజ్ వల్ల వచ్చిందని కాదు కానీ అంతా ఆ హనుమాన్ మహిమ. అక్కడి ఆడియన్స్ కి థాంక్స్ చెప్పేందుకు హనుమాన్ టీమ్ యుఎస్ ట్రిప్ ప్లాన్ చేస్తే బాగుంటుంది.

ఇక ఈ సినిమా హిందీ బెల్ట్‌లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టడం విశేషం. హృతిక్ రోషన్ ‘ఫైటర్’ విడుదలయ్యే జనవరి 25 వరకు ఇది బాక్సాఫీస్ వద్ద ఫ్రీ రన్ ఉంటుంది. తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ, దర్శకత్వం వహించారు. అమృత అయ్యర్ కథానాయికగా నటించగా, వరలక్ష్మి సోదరి పాత్రలో నటించారు. వినయ్ రాయ్ విలన్‌గా, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య వినోదాన్ని అందించారు. హునుమాన్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో 2025లో విడుదల కానున్న ‘జై హనుమాన్’ పై అంచనాలు మరింత పెరిగాయి.

Also Read News

Scroll to Top