Mega Blood Donation Camp: రక్త దానం చెయ్యండి… ప్రాణ దాతలవ్వండి -అనగాని

Mega Blood Donation Camp: మాజీమంత్రి, టీడీపీ నాయకులు పరిటాల రవీంద్ర 19 వ వర్ధంతి సందర్భంగా మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేస్తున్న సందర్భంలో శాసన సభ్యులు అనగాని సత్య ప్రసాద్ విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ రక్త దానం చెయ్యండి… ప్రాణ దాతలవ్వండి అని అన్నారు.
Share the news

జనవరి 24 న మెగా రక్తదాన శిబిరం(Mega Blood Donation Camp)

Mega Blood Donation Camp: రక్త దానం చెయ్యండి… ప్రాణ దాతలవ్వండి -అనగాని

బాపట్ల జిల్లా రేపల్లె: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, టీడీపీ నాయకులు పరిటాల రవీంద్ర 19 వ వర్ధంతి సందర్భంగా మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చెయ్యటం అభినందనీయం అని శాసన సభ్యులు అనగాని సత్య ప్రసాద్ అన్నారు.

Mega Blood Donation Camp గురించి అనగాని

బాపట్ల జిల్లా, రేపల్లె టీడీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిటాల యువసేన, ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24 న పరిటాల రవీంద్ర వర్ధంతిని పురస్కరించుకుని మెగా రక్త దాన శిభిరంతో పాటు వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత 17 సంవత్సరాలుగా పరిటాల యువసేన నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. కరోన మహమ్మారి తీవ్రంగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని ప్రజలకు పలు సేవలు అందించారని చెప్పారు. రక్త దానం చెయ్యంటం.. ప్రాణ దానంతో సమానమని ప్రతి ఒక్కరు మెగా రక్త దాన శిబిరంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.

See also  Resignations row in YCP continues: YCP పార్టీకి, ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

కార్యక్రమంలో పరిటాల యువసేన అధ్యక్షులు దండ మూడి ధరణి కుమార్, నాయకులు జీవి నాగేశ్వరరావు, వేమూరి అజయ్, ధర్మతేజ, రవి తదితరులు పాల్గొన్నారు.

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top