నిమ్మకూరు లో జరిగిన NTR Death Anniversary లో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandra Babu)
రాముడు అంటే గుర్తుకు వచ్చేది ఎన్టీఆరే. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ స్థానం చిరస్మరణీయం. రాజకీయాల్లో దశ.దిశ నిర్దేశించిన వ్యక్తి ఎన్టీఆర్.
పన్నులు పెంచితే పేదలు మరింత పేదరికంలోకి వెళ్తారు . సంపద సృష్టించడమే మా ధ్యేయం. సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం. జగన్ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదు.
ప్రపంచంతో నిమ్మకూరును అనుసంధానం చేస్తాం. నిమ్మకూరు గ్రామంలో 1800 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది .గ్రామంలో వ్యవసాయం చేసేది 80 మంది మాత్రమే .గ్రామం నుంచి చాలామంది వలస వెళ్లారు .గ్రామం నుంచి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు . గ్రామంలో కుటుంబాలను బాగుచేసే బాధ్యత తీసుకోవాలి .ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో సహకారం అందిస్తాం .ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలను అన్వేషించాలి . వెనుకబడిన వర్గాలను ఆర్థిక చేయూత అందించాలి .ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి.