Raa Kadaliraa meeting at Gudivada: టీడీపీ-జనసేన పొత్తు.. జగన్ చిత్తు.. -గుడివాడ సభలో బాబు

Raa Kadaliraa meeting: 'టీడీపీ-జనసేన పొత్తు.. జగన్ చిత్తు..జగన్‌ ఓ రాజకీయ వ్యాపారి. ఆయనకు అధికారం అంటే దోపిడీ, రాజకీయం అంటే వ్యాపారం’ గుడివాడ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు.
Share the news

ఇసుక, మద్యం, మట్టి దోచేస్తున్నాడు

సిగ్గులేకుండా పేదలు, పెత్తందారులకు
జరుగుతున్న పోరాటం అంటున్నాడు
ఈయన దేశంలోనే సంపన్న సీఎం

వైసీపీలో పదవులకు అర్హతలు
బూతుశ్రీ బిరుదు ఉంటే ఎమ్మెల్యే
బూతు రత్న అయితే ఎంపీ
బూతు సామ్రాట్‌ అయితే మంత్రే

టీడీపీ-జనసేన పొత్తు.. జగన్ చిత్తు.. ఇక ఆయన గేమ్‌ ఈజ్‌ ఓవర్‌

Raa Kadaliraa meeting లో బాబు

Raa Kadaliraa meeting at Gudivada: టీడీపీ-జనసేన పొత్తు.. జగన్ చిత్తు.. -గుడివాడ సభలో బాబు

Raa Kadaliraa meeting

తెలుగు దేశం – జనసేన పొత్తు అని తెలియగానే వైసీపీ నేతల్లో దడ మొదలైందని చంద్రబాబు(Chandra babu)అన్నారు. అప్పటి నుంచి ఏ సర్వే చూసినా టీడీపీ-జనసేన కూటమే గెలుస్తుందని తేల్చుతున్నాయని అన్నారు. ఆ విషయం తెలిసి జగన్(Jagan Mohan Reddy) కు నిద్ర పట్టడం లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చుతున్నారని అన్నారు. నియోజకవర్గాల బదిలీలు ఎప్పుడన్నా చూశారా? ఇక్కడి చెత్తను అక్కడ.. అక్కడి చెత్తను ఇక్కడ పోస్తే ఉపయోగం ఏముంది? వైసీపీ అభ్యర్థులు అందరినీ మార్చినా వైసీపీ గెలవడం కలే. జగన్‌ ‘వైనాట్‌ 175’ అంటున్నాడు.. నేను వైనాట్‌ పులివెందుల అంటున్నా. పులివెందుల ప్రజలు జగన్‌కు ఎందుకు ఓటు వేయాలి? బాబాయిని చంపించినందుకా? సాగు నీరు ఇవ్వనందుకా..?’

See also  CM Ramesh : బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నుంచి కాంగ్రెస్‌కు రూ.30 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు.. కమలంలో కలకలం!

‘‘ముఖ్యమంత్రి పదవికి అర్హతలేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. బూతు శ్రీ అయిన వ్యక్తికి ఎమ్మెల్యే పదవి…బూతురత్నకు ఎంపీ పదవి.. బూతుసామ్రాట్ అయితే మంత్రి పదవి… ఇదీ ఈనాడు రాష్ట్రంలో సాగుతున్న రాజకీయం. ఎంపీలంటే పార్లమెంట్ లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావాలి. కానీ ఇక్కడున్న సైకో అవన్నీ అవసరం లేదంటున్నాడు.. చంద్రబాబుని తిట్టావా.. పవన్ కల్యాణ్(Pawan Kalyan) ను తిట్టావా.. లోకేశ్ ను తిట్టావా.. దానికి సాక్ష్యంగా వీడియోలు చూపించమంటాడు. ఇలాంటి సీఎం మనకు అవసరమా? అవేవీ చేయలేదు కాబట్టి..నీకు టిక్కెట్ ఇవ్వను అన్నాడు.. ఇక్కడున్న ఎంపీని. అదీ వీళ్ల రాజకీయం. బీసీ ఎంపీ కర్నూల్ నుంచి మాట్లాడుతున్నాడు..ఐదేళ్లలో తనకు జగన్‌ అపాయింట్‌మెంటే ఇవ్వలేదని వాపోయాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బూతుల మంత్రులూ.. జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు అధికార పార్టీ వేధింపులను చవిచూసిన టీడీపీ(TDP), జనసేన(Janasena) కార్యకర్తలు ఇక ఎవరైనా ఎదురొస్తే బడితపూజ చేసే పరిస్థితికి వచ్చారు.

See also  Janasena party office opening: రేపల్లెలో ఈ నెల 18న జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం!

గత ఎన్నికల సమయంలో ఊరూరా ముద్దులు పెడుతూ.. బుగ్గలు నిమురుతూ తిరిగాడు. ఇప్పుడు పరదాలు కట్టుకుని వాటి మాటున తిరుగుతున్నాడు. తప్పు చేసిన వాడే తప్పించుకుని తిరుగుతాడు. టీడీపీ తప్పు చేయదు. అందుకే ధైర్యంగా తిరుగుతున్నాం. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన వారెవరినీ వదలం. ప్రతి ఒక్కరికీ చక్రవడ్డీతో చెల్లిస్తాం. మొన్న తిరుపతిలో దొంగ ఓట్లు చేర్చారని ఎన్నికల కమిషన్‌ ఓ ఐఏఎస్‌ అధికారిపై వేటు వేసింది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు చేసే పని ఇదా? మీ వద్దకు ఓటు కోసం వచ్చే వైసీపీ నేతలను నిలదీయండి.. బూతుల నేతలు కాదు.. అభివృద్ధి నేతలు కావాలని అడగండి.

Raa Kadaliraa meeting: ఎమ్మెల్యే కొడాలి నానిపై చంద్రబాబు చురకలు

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై కూడా చంద్రబాబు చురకలు వేశారు. ఆయనది నోరా డ్రైనేజా అని ఎద్దేవా చేశారు. ఎంత ఫినాయిల్ వేసి కడిగినా అతని నోరు మురికి కాలువే అని అన్నారు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతుంటాడని. తన వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకొని.. నాకే పాఠాలు చెప్తారా? చూపిస్తా అన్నారు చంద్రబాబు.

See also  Resignations from YCP: కొనసాగుతున్న YCP ఎమ్మెల్యేల రాజీనామాల పరంపర.. ఇప్పట్లో ఆగేలా లేదు!

తెలుగుదేశం-జనసేన సునామీలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం. వైఎస్సార్ కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.ఈ రోజు నుంచి 83 రోజులు ఏ ఒక్క కార్యకర్త విశ్రమించ వద్దు. గెలుపు ధీమాతో అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదం. 83 రోజులు మీరంతా సైకిలెక్కి, తెలుగుదేశం-జనసేన జెండాలు కట్టుకొని ఇంటింటికీ తిరగాలి. ప్రజల్ని చైతన్యం చేయాలి- Raa Kadaliraa meeting లో బాబు

Also Read News

Scroll to Top