
Master Plan for Christian Votes
Christian Votes క్రిస్టియన్ ఓట్ల కోసం జగన్(Jagan Mohan Reddy) మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా? అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తన మేనత్త విమలారెడ్డిని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. ఈరోజు తాడేపల్లిలో పాస్టర్లతో ఆమె సమావేశమయ్యారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే పక్కన పెట్టాలని.. ఎన్నికల్లో వైసిపి కోసం పనిచేయాలని ఆదేశించారు.
దీంతో ఆమెను బ్రదర్ అనిల్ కుమార్ స్థానంలో రంగంలోకి దించినట్టేనని తేలిపోయింది.
బ్రదర్ అనిల్ కుమార్ భార్య షర్మిల(YS Sharmila) కాంగ్రెస్(Congress ) పగ్గాలు తీసుకున్న తరుణంలో.. క్రిస్టియన్ మైనారిటీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు వెళుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. దీనికి విరుగుడుగా క్రిస్టియన్ ఓటు వైసీపీ(YCP) నుంచి జారకుండా తన మేనత్త విమలారెడ్డిని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది.
విమలారెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా ప్రచార బాధ్యతలు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. అయితే బ్రదర్ అనిల్ కుమార్ దూకుడుకు ఆమె అడ్డుకట్ట వేయగలరా? లేదా? అన్నది చూడాలి.
-By Guduru Ramesh Sr. Journalist