TDP-Janasena: టీడీపీ-జనసేన పొత్తు బాగు.. ఇద్దరి మధ్య సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక మాత్రం జాగు..

TDP-Janasena: విందు రాజకీయాలు జరుగుతున్నాయి. ససమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి కానీ ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనేది మాత్రం తేలడం లేదు.
Share the news

TDP-Janasena పొత్తు

టీడీపీ, జనసేన పొత్తు కుదిరి ఇప్పటికే చాలా నెలలు అయ్యింది. అల్పాహార సమావేశాలవుతున్నాయి.. విందు రాజకీయాలు జరుగుతున్నాయి. ససమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి కానీ ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనేది మాత్రం తేలడం లేదు.

ఇక వైసీపీ లో సీట్ల మార్పిడి గందర గోళం వల్ల టీడీపీ/జనసేన వైపు చూస్తున్న అధికార పార్టీ నాయుకులు, మరో పక్క జగన్ సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ లో చేరడం లాంటి పరిణామాలు టీడీపీ-జనసేన పొత్తుకు మరింత కలసి వచ్చే అవకాశాలే. దీనితో తమ గెలుపు నల్లేరు పై బండి నడక అని భావిస్తున్నట్లున్నారు టీడీపీ, జనసేన అధినేతలు. కానీ ఇది నియోజకవర్గాల్లోని నాయుకులకు, కార్యకర్తలకు మాత్రం అసహనం పెంచుతుంది. ఎవరు ఎక్కడనుంచి పోటీ అనేది తెలిస్తే, లోకల్ గా వుండే నాయికలను, కార్యకర్తలను కలుపుకుంటూ, పోటీకి తయారవుతారు. ఇంకో పక్క గ్రామాల్లో తిరిగి హామీలు ఇవ్వటానికి గాని, తటస్థులను తమ వైపు తిప్పుకోవడానికి గాని వీలవుతుంది. ఆలా కాకుండా లాస్ట్ మినిట్ వరకు తేల్చకపోతే ఎదుటి పక్షం వాళ్ళు ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ఛాన్స్ వుంది.

See also  Civil Service Officers Failure: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సివిల్ సర్వీస్ అధికారులు రాణించడం లేదెందుకని?

TDP-Janasena: గుంటూరు ఎంపీ సీట్

అధికార పార్టీ ఇప్పటికే నాలుగు జాబితాలతో మొత్తం 59 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలకు In Charge లను ప్రకటించి ముందుంది. దాంతో వారంతా నియోజక వర్గాల్లో తిరుగుతున్నారు.
ఉదాహరణకు గుంటూరు ఎంపీ సీట్ విషయానికొస్తే బోనబోయిన శ్రీనివాస్ యాదవ్(జనసేన), డేగల ప్రభాకర్(తెదేపా) లలో ఎవరికి సీట్ వస్తుందో తెలియక మల్లగుల్లాలు పడుతుంటే ఇంకో పక్క మంత్రి విడుదల రజని వైసీపీ నుంచి ప్రచారం ప్రాంభించేసింది అంటున్నారు. ఇక కుల సమీకరణాలు చూసుకుంటే ఇక్కడ ప్రధానమైన కులాలు కమ్మ, కాపు, వెనుకబడిన తరగతుల వారు. వైసీపీ కాపు, వెనుకబడిన తరగతుల ఓట్ల ద్వారా ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ మరియు జనసేనల మధ్య ఈ సీటు ఎవరికి అనేది ఇంకా స్పష్టత రాకపోవడం, అభ్యర్థి ఎంపిక జరగకపోవడంతో నాయుకులు, కార్యకర్తలతో సహా ప్రజలు కూడా గందరగోళానికి గురవుతున్నారు. మంత్రి విడుదల రజని మాత్రం తనకున్న ఆర్థిక బలంతో అనేక గ్రామాలలో తన అనుచరులను ఏర్పరచుకుంటూ దూసుకెళ్తుంది అని విశ్లేషకులు అభిప్రాయము.

See also  Pothina Mahesh: జనసేనకు పోతిన మహేష్ రాజీనామా! త్వరలో వైసీపీలోకేనా?

కనుక పొత్తు ధీమా తో నత్త నడకలా నిర్ణయాలు స్లోగా తీసుకుంటే అసలుకే మోసం వస్తుంది. టీడీపీ, జనసేన అధినేతలు ఇకనైనా దీనిపై దృష్టి పెట్టి ఎంత త్వరగా సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తే అంత మంచిది.

Also Read News

Scroll to Top