Review Meeting on Civil Supplies: పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ప‌థ‌కాల పై స‌మీక్ష

Review Meeting on Civil Supplies: రాష్ట్ర స‌చివాలయంలో డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, సాగునీటి పారుద‌ల‌, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్త‌మ్ కుమార్ రెడ్డిలు రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ బ‌డ్జెట్ ప్ర‌తిపాధ‌న‌ల‌పై ఆశాఖ ఉన్న‌త అధికారుల‌తో స‌మీక్ష చేశారు.
Share the news
Review Meeting on Civil Supplies: పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ప‌థ‌కాల పై స‌మీక్ష

Review Meeting on Civil Supplies:

రాష్ట్ర స‌చివాలయంలో డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, సాగునీటి పారుద‌ల‌, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్త‌మ్ కుమార్ రెడ్డిలు రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల(Civil Supplies) శాఖ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, ఆ శాఖ ఆర్ధిక ప‌రిస్థితి, 2024-25 వార్షిక సంవ‌త్స‌రం అమ‌లు చేయాల్సిన ప‌థ‌కాల‌కు కావాల్సిన బ‌డ్జెట్ ప్ర‌తిపాధ‌న‌ల‌పై ఆశాఖ ఉన్న‌త అధికారుల‌తో స‌మీక్ష చేశారు.

సమీక్ష ఆనంత‌రం రాష్ట్ర స‌చివాల‌యంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి ఎన్‌. ఉత్త‌మ్ కుమార్ రెడ్డిలు మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క కామెంట్స్‌

పేద‌ల‌కు ఉచితంగా బియ్యం పంపిణీ చేయ‌డంతో పాటు రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేటువంటి పౌర‌స‌ర‌ఫ‌రాల(Civil Supplies) శాఖకు గ‌త ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌కుండ‌ ఆర్ధికంగా నిర్వీర్యం చేసింది.

పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు ధాన్యం కొనుగోలు చేయ‌డానికి నిధులు ఇవ్వ‌కుండ నిర్ల‌క్షం చేసి ఆ శాఖ‌ను రూ. 58, 860 కోట్లు అప్పుల భారంలోకి నెట్టింది.

See also  False propaganda on electricity supply: విద్యుత్తు స‌ర‌ఫ‌రా పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే ప్ర‌జ‌లే బుద్ది చెప్తారు..భ‌ట్టి

2014-15లో రాష్ట్ర ప్ర‌భుత్వం సివిల్ స‌ప్లై శాఖ‌కు కేవ‌లం రూ.387 కోట్లు మాత్ర‌మే బ‌కాయిలు ఉండ‌గా 2024 నాటికి రూ.14,354 కోట్లకు పెరిగింది.

2014 సంవ‌త్సరానికి ముందున్న ప్ర‌భుత్వాలు రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయ‌డానికి సివిల్ స‌ప్లై శాఖ‌కు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించే వారు. గ‌త ప్ర‌భుత్వంలో డ‌బ్బులు ఇవ్వ‌కుండ రుణాలు తీసుకోమ‌ని గ్యారంటీ ఇచ్చి స‌విల్ స‌ప్లై శాఖ‌పై భారం మోపారు.

గ‌త ప్ర‌భుత్వం చేసిన నిర్ల‌క్ష్యం నిర్వాకం వ‌ల్ల సివిల్ స‌ప్లై శాఖ పాత బకాయిలు కట్టడం కోసం, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి మళ్ళీ అప్పు తీసుకునే దుస్తితిలోకి నెట్టి వేశారు.

బ్యాంకులు రుణాలు ఇవ్వ‌డానికి గ్యారెంటీలు ఇస్తే తప్ప గ‌త ప్ర‌భుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కానీ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయ‌డానికి నిధులు ఇస్తున్న‌ట్టు గొప్ప‌లు చెప్పుకోవ‌డం విడ్డూరం.

ధనిక రాష్టాన్ని చేతుల్లో పెడితే రాష్ట్రం తెలంగాణ‌ను ఆన్యాయంగా ఆగ‌మైపోయింది.

See also  TS Traffic police to give up to 80% discount on traffic challans: వాహనదారులకు క్రిస్మస్ & సంక్రాంతి కానుక!

ఉమ్మ‌డి రాష్ట్రంలో 2.82 కోట్ల మంది ల‌బ్ధిదారుల‌కు బియ్యం పంపిణీ చేసిన‌ప్పుడు కూడ సివిల్ స‌ప్లై శాఖ‌కు ఇంత అప్పుల‌ భారం లేదు.

సివిల్ స‌ప్లై శాఖ‌పై ఇంత భారం ఉన్నా లబ్ధిదారులకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా బియ్యం పంపిణీ చేయాల‌ని, విద్యార్థులకు స‌న్న బియ్యం కొనుగోలు చేసి స‌ర‌ఫ‌రా చేయాల‌ని, రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ధాన్యం కొనుగోలు చేయాల‌ని సివిల్ సప్లై శాఖ కమిషనర్ ను స‌మీక్ష స‌మావేశంలో ఆదేశించాం.

గ‌త ప్ర‌భుత్వం సివిల్ స‌ప్లై శాఖ‌లో చేసిన ఆర్ధిక ఆరాచ‌క‌త్వం గురించి వాస్త‌విక విష‌యాలు చెప్తున్నాం.

కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం అభివృద్ది చెందాల‌నే ప్ర‌జ‌ల క‌ల‌లు నిజం చేయ‌డానికి ఎన్ని కష్టాలు వ‌చ్చిన ఆర్ధిక ఇబ్బందులు ఉన్న‌ అధిగ‌మించి ఇందిరమ్మ రాజ్యం కోసం అహర్నిశలు కృషి చేస్తాం అన్నారు.

Also Read News

Scroll to Top