Hanuman Donation to Ayodhya Ram: అయోధ్య రాములోరికి, మన హనుమాన్ విరాళమెంతో తెలుసా?

Hanuman Donation to Ayodhya Ram: ఇచ్చిన మాట ప్రకారం హనుమాన్ మూవీ టీం, అయోధ్య రామ్ మందిరానికి విరాళం (అమ్ముడైన ప్రతి టిక్కెట్ పైన 5 రూ.) ఇస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలియ పరిచారు.
Share the news
Hanuman Donation to Ayodhya Ram: అయోధ్య రాములోరికి, మన హనుమాన్ విరాళమెంతో తెలుసా?

అయోధ్య రాములోరికి, మన హనుమాన్ విరాళమెంతో (Hanuman Donation) తెలుసా? అక్షరాలా 2,66,41,055 రూపాయలు.. Wow!

Hanuman Donation ప్రకటన

రిలీజ్ ఫంక్షన్ లో హను-మాన్ టీమ్ అయోధ్య రామ మందిరానికి తమ విరాళం చిరంజీవి ద్వారా ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇక ఇప్పుడు అన్నమాట ప్రకారం HanumaN సినిమా నుంచి అమ్ముడయ్యిన ప్రతి టిక్కెట్టు నుండి Rs 5/- తీసి రామ మందిరానికి ఇస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు

Also Read:  “హను మాన్” టైటిల్ చిరంజీవి సూచించారా ?

Hanuman Donation 2,66,41,055 రూపాయలు

ఇకపోతే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ సినిమాకి 53,28,211 టిక్కెట్లు అమ్ముడు కాగా అందులోంచి 2,66,41,055 రూపాయలు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. దీనితో సోషల్ మీడియా లో మూవీ టీం పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

ప్రశాంత్ వర్మ(Prashant Varma) దర్శకత్వంలో తేజా సజ్జా(Teja Sajja) హీరోగా వచ్చిన హనుమాన్ మూవీ ఇప్పటికే 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లని సొంతం చేసుకుంది. మన పురాణాలలో ఉన్న సూపర్ హీరో హనుమాన్ స్ఫూర్తి తో తీసిన ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్ లో అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఇకపై వచ్చే కలెక్షన్స్ లో నుంచి కూడా ప్రతి టికెట్ నుంచి 5 రూపాయిలు రామ మందిరానికి పంపించనున్నారంట. ఓ విధంగా అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరగడం హనుమాన్ మూవీ రిలీజ్ కావడం ఒకే నెలలో కావడంతో ఆ బజ్ కూడా సినిమాకి బాగా కలిసొచ్చింది. చిత్ర యూనిట్ ప్రకటించిన విరాళం నార్త్ ఇండియాలో బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో ఇప్పటికే హనుమాన్ కలెక్షన్స్ పరంగా టాప్ 5 లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

See also  Two Padma Vibhushan winners in Single Frame: ఇద్దరు పద్మ విభూషణలు ఆత్మీయ కలయిక!

Also Read News

Scroll to Top