
Ram Mandir satellite image
ప్రస్తుతం దేశం మొత్తమే కాదు, ప్రపంచం లో భారతీయులు ఉన్న అన్ని చోట్ల ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం(Ram Mandir) గురించి మరియు రామ నామమే వినిపిస్తోంది. విదేశాల్లో ఉన్న హిందువులు కూడా అక్కడి ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అంతరిక్షం నుంచి తీసిన అయోధ్య రామాలయ ఫోటోలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో విడుదల చేసింది.
Also Read: అయోధ్య ప్రస్థానం 1528 to 2024.. వివాదం నుంచి ఆలయ ప్రాణప్రతిష్ఠ వరకు!
ఈ శాటిలైట్ ఇమేజ్ లో అయోధ్య రామ మందిరం కనిపిస్తోంది. మందిరంతో పాటు దశరథ్ మహల్, సరయూ నది కూడా కనిపిస్తున్నాయి. వీటితోపాటు కొత్తగా పునరుద్ధరించబడిన అయోధ్య రైల్వే స్టేషన్ కూడా వాటిలో కనిపిస్తోంది. అంతరిక్షంలో భారత్‌కు చెందిన ఉపగ్రహాలు కొన్ని ఒక మీటర్ కంటే తక్కువ రిజల్యూషన్ కలిగి ఉన్నవి కూడా ఉన్నాయి. ఈ చిత్రాన్నీ డిసెంబర్ 16న ఇండియన్ రిమోట్ సెన్సింగ్ కార్టోశాట్ శాటిలైట్ క్యాప్చర్ చేయగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) ప్రాసెస్ చేసింది.
2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీరామ ఆలయాన్ని శాటిలైట్ ఇమేజ్ లో చూడవచ్చు. 2023 డిసెంబర్ 16 వ తేదీన నిర్మాణంలో ఉన్న రామ మందిరం ఫొటోలను శాటిలైట్ తీసింది. భారతీయ రిమోట్ సెన్సింగ్ సిరీస్ ఉపగ్రహాలను ఉపయోగించి.. దాని వివరణాత్మక View కూడా చూపబడింది.
Satellite Image ఫుల్ వ్యూ కొరకు Click Here