Pawan in Ayodhya: రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి వెళ్లిన పవనుడు..

Pawan in Ayodhya: చరిత్ర లో నిలిచి పోయే రోజు.. కేవలం కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి, అయోధ్యలోని రామ మందిరం ప్రతిష్ఠాపన వేడుకకు సిద్ధంగా ఉంది. ఇక మన పావనుడు కూడా అయోధ్య చేరుకున్నాడు
Share the news
Pawan in Ayodhya: రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి వెళ్లిన పవనుడు..

Pawan in Ayodhya

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్య చేరుకున్నారు. అయోధ్యలో రామమందిరం కల సాక్షాత్కారమైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భారతీయులు ఎన్నో ఏళ్లుగా ఈ ఘట్టం కోసం ఎదురు చూస్తున్నారని, తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ అయోధ్యకు వెళ్లే మార్గం లో తన ట్విటర్ హేండిల్ లో ఈ విధంగా పోస్ట్ పెట్టారు
అయోధ్యకు వెళ్లే మార్గంలో…
‘రాముడి ప్రాణ ప్రతిష్ట..’ సాక్షిగా
రాముడు ‘మన భారత నాగరికత యొక్క వీరుడు.’ మరియు శ్రీరాముడిని ‘అయోధ్యలోకి’ తిరిగి తీసుకురావడానికి ఐదు శతాబ్దాల పోరాటం పట్టింది.
ధర్మో రక్షతి రక్షితః

సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమయ్యే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఒంటి గంటకు ముగియనుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. దాదాపు 8 వేల మంది అతిథులు పాల్గొనే ఈ మహా ఘట్టాన్ని కోట్లాది మంది ప్రజలు టీవీలు/ఆన్‌లైన్‌ వేదికల్లో ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.

See also  CBN fires on Jagan: తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతావా జగన్ రెడ్డి.. ఎంత సిగ్గు చేటు -బాబు

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ పలు ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పలు హిందూ ధార్మిక సంస్థలు ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

Also Read News

Scroll to Top