Bharat Ratna to Karpoori Thakur: బీహార్ మాజీ సీఎం, జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ కు భారత రత్న!

Share the news
Bharat Ratna to Karpoori Thakur: బీహార్ మాజీ సీఎం, జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ కు భారత రత్న!

Bharat Ratna to Karpoori Thakur

Bharat Ratna to Karpoori Thakur: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, జన్ నాయక్ కర్పూరీ ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించింది. ఆయన 1988లో మరణించారు. బడుగులకు ఆయన చేసిన సేవలకు మెచ్చిన కేంద్రం దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. బుధవారం (జనవరి 24) కర్పూరీ ఠాకూర్ శతజయంతి.

కర్పూరీ ఠాకూర్‌ను భారతరత్నతో సత్కరించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది ఉన్న సంగతి తెల్సిందే. మంగళవారం (జనవరి 22) ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలని, అలాగే ఆయన పేరు మీద యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని జేడీయూ నాయకుడు కేసీ త్యాగి కూడా డిమాండ్ చేశారు.

మంగళవారం (జనవరి 22) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్పూరి ఠాకూర్ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్టు చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. కర్పూరీ ఠాకూర్‌ని బిహార్‌లో జననాయక్‌ అని కూడా పిలుస్తారు. కొంతకాలం బిహార్ ముఖ్యమంత్రి గా పని చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన మొదటి పదవీకాలం డిసెంబర్ 1970 నుండి జూన్ 1971 వరకు కొనసాగింది. మరల డిసెంబర్ 1977 నుండి ఏప్రిల్ 1979 వరకు సీఎం పదవిలో ఉన్నారు. సోషలిస్ట్ పార్టీ, భారతీయ క్రాంతి దళ్ ప్రభుత్వంలో తొలిసారి కర్పూరి ఠాకూర్ సీఎం కాగా, రెండోసారి జనతా పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు.

See also  Bharat Ratna LK Advani: భారతరత్న అందుకోనున్న ఎల్‌కె అద్వానీ జీవిత విశేషాలు ఓ సారి చూసేద్దామా!

కర్పూరి ఠాకూర్ బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని పితౌజియా (ప్రస్తుతం కర్పూరి గ్రామం) గ్రామంలో గోకుల్ ఠాకూర్, రామ్‌దులారి దేవి కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశలోనే జాతీయవాద ఆలోచనలతో ప్రభావితమై అఖిల భారత విద్యార్థి సమాఖ్యలో చేరారు. అతను క్విట్ ఇండియా ఉద్యమంలో చేరడానికి తన డిగ్రీని కూడా విడిచిపెట్టారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు అయన 26 నెలలు జైలు జీవితం కూడా గడిపారు.

1 thought on “Bharat Ratna to Karpoori Thakur: బీహార్ మాజీ సీఎం, జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ కు భారత రత్న!”

  1. Pingback: కర్పూరీ ఠాకూర్‌కు Bharat Ratna, ఇంత వరకు ఈ అవార్డు ఎంత మందికి వచ్చిందో తెలుసుకుందామా! - Samachar Now

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top