Janasena gets Glass Symbol Again for 2024 Elections: జనసేనకు మరల గాజు గ్లాసు గుర్తు ఖరారు చేసిన EC !

Share the news
Janasena gets Glass Symbol Again for 2024 Elections: జనసేనకు మరల గాజు గ్లాసు గుర్తు ఖరారు చేసిన EC !

Glass Symbol Again for 2024 Elections

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం 2024 ఎలక్షన్స్ కు గాను గాజు గ్లాసు గుర్తును (Glass Symbol) ఖరారు చేసింది. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా ఉత్తర్వులు పంపించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్ధులు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ సారి ఎన్నికల్లో అంటే 2024 అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన అభ్యర్ధులు ఎన్నికల బరిలో దిగనున్నారు. ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రతాప్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు అందజేశారు.

See also  YCP అవినీతిపాలన అంతమే కూటమి లక్ష్యం -టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top