
Leaders queuing up for Janasena
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన(Janasena) పార్టీలోకి చేరికలు, వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా సినీ నటుడు, గతంలో వైసీపీకి రాజీనామా చేసిన పృథ్వీరాజ్(Prudhvi Raj) జనసేనలో చేరారు. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్స(Pawan Kalyan) మక్షంలో పార్టీలో చేరారు. పవన్ కల్యణ్ పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కాగా పృథ్వీరాజ్ 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత టీటీడీకి చెందిన ఎస్‌వీబీసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వివాదం కారణంగా ఆయనపై వైసీపీ వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా సీటు దక్కలేదు. మరి ఈసారి జనసేనలో చేరడంతో ఎక్కడి నుంచి పోటీకి దిగబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రముఖ సినీ నటుడు శ్రీ పృధ్వీ రాజ్ బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. pic.twitter.com/2SC8CxdxFC
— JanaSena Party (@JanaSenaParty) January 24, 2024
మరొక పక్క సినీ నృత్య దర్శకుడు షేక్ జానీ మాస్టర్ (Johny Master) కొత్త గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో చేరారు. పవన్ కల్యాణ్ పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
‘‘ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరాను. ప్రత్యక్ష రాజకీయాల్లోకి నన్ను సాదరంగా ఆహ్వానించిన పవన్ అన్నకి నేనిచ్చిన మొదటి మాట ‘గెలుపోటములతో సంబంధం లేకుండా చచ్చేంత వరకు మీతోనే ఉంటా. మీ నమ్మకం నిలబెట్టుకుంటా’’ అని జానీ మాస్టర్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జానీ మాస్టర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగవచ్చుననే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో పొల్గొంటూ వస్తున్న విషయం తెలిసిందే.
జనసేన పార్టీలో చేరిన సినీ నటుడు శ్రీ పృథ్వీరాజ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ pic.twitter.com/kB13NgvHyA
— JanaSena Party (@JanaSenaParty) January 24, 2024