
అర్జున్ రెడ్డి ఈ పేరు వినగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా. ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరూ సినిమాల్లో మంచి పొజిషన్ లో ఉన్నవాళ్ళే… అయితే సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి, తమిళ్, మలయాళం బాషలలో కూడా రీమేక్ అయి మంచి హిట్ అయ్యాయి. అయితే తమిళ్ లో రెండు సార్లు రీమేక్ అయింది ఈ సినిమా..ఇక హిందీ లో తానే స్వయంగా కబీర్ సింగ్ అని రీమేక్ చేసాడు సందీప్ రెడ్డి వంగా.
కబీర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు… అయితే దాని తర్వాత సందీప్ రెడ్డి వంగా చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశానికి చేరిన సమయంలో స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ ను తెరక్కేకిస్తున్నారు అని తెలిసి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకాయి. ట్రయిలర్ రిలీజ్ తో మరింత క్రేజ్ వచ్చింది. ఇక మూవీ అయితే రికార్డులను కొల్లగొట్టింది.
అయితే సెన్సార్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ తీసేసినా అటు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఫీమేల్ ఆడియన్స్ నుండి ఎక్కువ సపోర్ట్ రాలేదు. అందువల్ల కొన్ని సీన్స్ ని OTT వెర్షన్ లో యాడ్ చేస్తానని సందీప్ రెడ్డి వంగా చెప్పడం జరిగింది. కేవలం ఆ సీన్ల కోసమే ధియేటర్ లకి క్యూలు కట్టిన జనాలు OTT లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూశారు అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ఫ్యాన్స్ కి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు…
Animal Movie Twist: అసలేమయింది?
నిజానికి సినిమా ధియేటర్ వర్షన్ లో 3 గంటల 21 నిమిషాలు ఉంది కానీ OTT వర్షన్ లో ఇప్పుడు 3 గంటల 24 నిమిషాలు ఉంది. అయితే గతంలో సందీప్ రెడ్డి వంగా ఇంకో 8 నిమిషాలు యాడ్ చేస్తామని చెప్పారు కాకపోతే ఇప్పుడు కేవలం మూడు నిమిషాలు మాత్రమె యాడ్ అయి ఉండడం చూసి ఫ్యాన్స్ ఇదేం Animal Movie Twist రా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి యానిమల్ మూవీలో కొన్ని వయలేంట్ సీన్స్, న్యూడ్ సీన్స్ ఉన్నాయని ఫ్యాన్స్ చెప్పారు అయితే A రేటింగ్ తో రిలీజ్ అయిన ఈ సినిమాలో అసభ్యకర సీన్స్ చాలానే ఉన్నాయి ఫాదర్ ఎమోషన్ అని ఫ్యామిలీని తీసుకెళ్తే ఇంట్లో తిట్టారు అని చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేసారు.
మరి ఈ విషయం గురించి సందీప్ రెడ్డి వంగా కానీ, యానిమల్ టీం లేదా Netflix టీం ఎం అంటారో చూడాలి… ఇక ఈ సినిమా గురించి మాట్లాడితే సినిమాలో సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి. సినిమాలో ముఖ్య పాత్రలో రష్మిక మందన్న, అనీక్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, ముఖ్య పాత్రల్లో నటించారు.
-By Pranav @ samacharnow.in