
బిహార్ ముఖ్యమంత్రి జేడీయూ(JDU) అధినేత నితీశ్ కుమార్(Nitish Kumar) రికార్డుస్థాయిలో తొమ్మిదో సారి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నితీష్ కుమార్‌తో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం స్వీకారం చేయించారు. నితీశ్‌తో పాటు మరో ఎనిమిది మందిని మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీ(BJP)కి చెందిన విజయ్ కుమార్ సిన్షా, సామ్రాట్ చౌదరి డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేసారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, హిందూస్థాన్ ఆవామ్ మోర్చా నుంచి ఇద్దరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
Bihar Politics
బిహార్ ముఖ్యమంత్రి పదవికి ఆదివారం ఉదయం రాజీనామా చేసిన నితీశ్ కుమార్.. మళ్లీ బీజేపీ మద్దతుతో సాయంత్రమే సీఎంగా ప్రమాణం చేయడం విశేషం. మహాకూటమి నుంచి బయటకొచ్చిన నితీశ్.. మళ్లీ ఏడాదిన్నర తర్వాత మళ్ళీ ఏన్డీయేతో జట్టుకట్టారు.
జీవితంలో ఇక బీజేపీతో కలిసేది లేదని 2022 సెప్టెంబరులో ప్రకటించిన నితీశ్ ఏడాదిన్నరలోనే మళ్లీ ఎన్డీఏతో జట్టుకట్టారు. మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. బిహార్ రాజకీయ పరిణామాలు(Bihar Politics) ఉత్కంఠ రేపడంతో పాటు అసహ్యం కూడా కలిగిస్తున్నాయి.
రంగులు మార్చడంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని నితీశ్ కుమార్ ని కాంగ్రెస్ విమర్శించింది. అదే ఊసరవెల్లి మొన్నటి దాకా వాళ్ళ కూటమి (I.N.D.I.A) లోనే ఉందన్న విషయం మర్చిపోయింది కాంగ్రెస్. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ఏర్పాటు చేసిన మహాకూటమి నుంచి జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ వైదొలిగి.. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీంతో బిహార్‌లో మరోసారి ఎన్‌డీయే సర్కార్ ఏర్పడింది.
కొస మెరుపు: నితీశ్ కుమార్, ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరితో ఐన కలుస్తాడు, ఏదైనా చేస్తాడు. ఏమాత్రం నమ్మదగిన వ్యక్తి కాదని అందరికి తెలిసిందే. అయినా సరే బీజేపీ మరల ఆయనను ఎందుకు NDA లోకి ఆహ్వానించిందో? అంతకు ముందు కాంగ్రెస్ I.N.D.I.A కూటమి లో ఎందుకు చేర్చుకుందో? జస్ట్ రాజకీయ అవసరం అంతే. Bihar Politics లో ఇవన్నీ చాలా సాధారణమే.