
Tribute to Cult Classic Sankarabharanam
తెలుగు సినిమాలో కల్ట్ క్లాసిక్ గా పరిగణించబడే శంకరాభరణం(Sankarabharanam) 2 ఫిబ్రవరి 1980న చాలా తక్కువ థియేటర్లలో మాత్రమే విడుదలైంది, అది కూడా దాదాపు ఖాళీ హాళ్లతో స్వాగతం పలికారు ప్రేక్షకులు. అయితే, ఒక వారంలో సానుకూల సమీక్షలు మరియు నోటి మాటలతో థియేటర్లు సినిమా చూడాటానికి వచ్చే వారితో నిండిపోయాయి. తరువాత ఆ సినిమా ఎన్నో అవార్డులు రివార్డులు పొంది ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచి పోయింది.
ఒక సంగీత కళాకారుడు వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చూపే సినిమా అప్పట్లో తెలుగు లో రాలేదు. ఎందరినో అనుకున్నా చివరికి జెవి సోమయాజులు(J V Somayajulu) ను శంకరశాస్త్రి గా నటింపచేయటం, వ్యాంప్ పాత్రల్లో నటించే మంజు భార్గవి తులసి పాత్రలో మెప్పించటం, అల్లు రామలింగయ్య సునిశిత హాస్యం, నిర్మలమ్మ, చంద్రమోహన్ లు బామ్మ,మనవళ్ళుగా అతికినట్టు ఆయా పాత్రలకు సరిపోవడం, జంధ్యాల కలం బలం, బాల సుబ్రహ్మణ్యం, వేటూరి, కె వి మహదేవన్ ల విశ్వరూపం ఒకటి కాదు 24 క్రాఫ్ట్ లు పర్ఫెక్ట్ వర్క్ అయిన సినిమా శంకరాభరణం(Sankarabharanam).
ఇక ఈ సినిమాకు నిర్మాతలు ఏడిద నాగేశ్వరరావు,ఆకాశం శ్రీరాములు దర్శకుడు కె.విశ్వనాథ్(K Viswanath) ని నమ్మటం, ఇది కాశీనాథుని విశ్వనాథుడు వెండితెర పై ఆవిష్కరించిన దృశ్యకావ్యం కావటం, తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం
Awards for Sankarabharanam
-By C. Rambabu