TSRJC CET 2024: TS రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ మొదలు.. పరీక్ష తేదీ 21/4/2024

Share the news
TSRJC CET 2024: TS రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ మొదలు.. పరీక్ష తేదీ 21/4/2024

TSRJC CET 2024

తెలంగాణలోని 35 గురుకుల జూనియర్​ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్​ మొదటి సంవత్సరం MPC / BPC /MEC (ఇంగ్లిష్ మీడియం) లలో ప్రవేశాలకు TSRJC CET-2024 నోటిఫికేషన్​ విడుదల అయింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్​ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 31న ప్రారంభమైంది. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 21న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు MPC / BPC /MEC గ్రూపుల్లో చేరేందుకు అర్హులు. ప్రవేశ పరీక్షలో మెరిట్​, రిజర్వేషన్​ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మే నెలలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

మొత్తం సీట్ల సంఖ్య 2,996. MPC – 1,496, BPC – 1,440, MEC – 60.

See also  Hyderabad లో ఓవైసీ కోసం బలహీన అభ్యర్థి.. ప్రతిగా తెలంగాణాలో ముస్లిం ఓట్లు పొందాలని కాంగ్రెస్ ప్లాన్?

పరీక్ష విధానం: TSRJC CET 2024 మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మల్టీపుల్​ చాయిస్​ విధానంలో విద్యార్థులు ఎంచుకునే గ్రూప్​ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలడుగుతారు. ఎంపీసీ విద్యార్థులకు ఇంగ్లిష్​, మ్యాథ్స్​, ఫిజిక్స్​ నుంచి; బైపీసీ విద్యార్థులకు ఇంగ్లిష్​, బయోలజికల్​ సైన్స్​, ఫిజిక్స్ నుంచి అదేవిధంగా ఎంఈసీ గ్రూప్​లో చేరేవారికి ఇంగ్లిష్​, సోషల్​ స్టడీస్​, మ్యాథ్స్​ సబ్జెక్టుల నుంచి పదోతరగతి స్థాయిలో ఒక్కోసబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.

పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

TSRJC CET 2024 Important Dates:

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 31.01.2024.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 15.03.2023.
  • ప్రవేశ పరీక్ష తేది: 21.04.2023.
  • మొదటి విడత కౌన్సెలింగ్: మే 2024లో.
See also  Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..?

నోటిఫికేషన్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి
ప్రాస్పెక్టస్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి
యూజర్ మాన్యువల్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి
ప్రవేశ రుసుము చెల్లింపు మరియు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top