Sivaraj Kumar in Chiru’s home: చిరు ఇంట్లో శివ రాజ్ కుమార్ పిక్స్ వైరల్

Sivaraj Kumar in Chiru's home: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ప్రత్యేకంగా వెళ్లి అభినందిస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రోజుల నుంచి చిరంజీవి ఇంటికి ప్రముఖులు వెళ్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు చిరంజీవి ఇంటికి కన్నడ శివ రాజ్ కుమార్ వచ్చాడు.
Share the news
Sivaraj Kumar in Chiru’s home: చిరు ఇంట్లో శివ రాజ్ కుమార్ పిక్స్ వైరల్

కన్నడ టాప్ హీరో శివ రాజ్ కుమార్ బెంగళూర్ నుంచి హైద్రాబాద్‌కు వచ్చారు. చిరంజీవి గారికి ఇటీవల పద్మ విభూషణ్ రావడంతో అభినందించేందుకు ప్రత్యేకంగా వచ్చారు. ఇక చిరంజీవి ఇంట్లో విందు కూడా ఆరగించారు. శివన్నకు Chiru కూతురు సుస్మిత ప్రేమగా వడ్డిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ప్రత్యేకంగా వెళ్లి అభినందిస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రోజుల నుంచి చిరంజీవి ఇంటికి ప్రముఖులు వెళ్తూనే ఉన్నారు.. అభినందిస్తూనే ఉన్నారు. శనివారం రాత్రి ఉపాసన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై అభినందించారు.

Sivaraj Kumar in Chiru’s home

ఇక ఇప్పుడు చిరంజీవి ఇంటికి కన్నడ శివ రాజ్ కుమార్ వచ్చాడు. శివన్న ప్రేమగా బెంగళూరు నుంచి హైద్రాబాద్‌కు వచ్చి స్వయంగా Chiru కు అభినందనలు తెలిపాడు. ఇక చిరుతో పాటుగా ఇంట్లోనే లంచ్ చేశాడు. ఇక శివన్న రాకపై మెగాస్టార్ చిరంజీవి వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

See also  TS Govt to honor Padma Award Winners: పద్మఅవార్డులు అందుకున్న తెలుగు వారిని సత్కరించనున్న TS Govt.

“నన్ను అభినందించేందుకు బెంగళూరు నుంచి నా ప్రియ మిత్రుడు శివ రాజ్ కుమార్ రావడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది.. మాతో అతను ఎంతో విలువైన సమయాన్ని గడిపాడు. మా మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ నాటి రోజుల గురించి మాట్లాడుకున్నాం.. రాజ్ కుమార్ గారితో, ఆయన కుటుంబంతో ఉన్న బంధం గురించి మాట్లాడుకున్నాం.. ఎంతో సంతోషంగా ఉంది” అంటూ చిరంజీవి ట్వీట్ చేసారు.

Chiru and Sivaraj Kumar

అయితే ఆ ఫోటోలలో ఒక ఫోటో ఇంకా వైరల్ గా మారింది.. అంతగా వైరల్ అవ్వడానికి అసలు ఆ ఫోటోలో ఏముంది? సరిగ్గా గమనిస్తే ఆ ఫోటోలో చిరంజీవి, శివరాజ్ కుమార్ లు పక్కపక్కన నిల్చున్నారు… చిరు వెనకాల పలు అవార్డ్స్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో దిగిన ఫోటో ఉంది. రీసెంట్ గా వచ్చిన ఒక రూమర్ ప్రకారం బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమాలో శివన్న ఒక రోల్ ప్లే చేస్తున్నాడని సమాచారం వచ్చిన విషయం తెలిసిందే… అయితే ఈ ఫోటోతో అది నిజమే అయుండొచ్చు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు…

See also  రామ చరణ్ Game Changer నుంచి మొదటి సింగల్ జరగండి జరగండి అవుట్!

శివన్న గత ఏడాది జైలర్ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి స్పెషల్ పాత్రను చేశాడు. శివన్న ఎంట్రీకి థియేటర్లు దద్దరిల్లిన సంగతి తెలిసిందే. దాంతో పాటు కెప్టెన్ మిల్లర్ సినిమాలో పాత్రకి తెలుగులో అంతగా రాకపోయినా తమిళ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

-By Pranav @ samacharnow.in

Also Read News

Scroll to Top