Vidadala Rajini: గుంటూరు వెస్ట్ లో సతమతం అవుతున్న విడదల రజనీ!

Share the news
Vidadala Rajini: గుంటూరు వెస్ట్ లో సతమతం అవుతున్న విడదల రజనీ!

Vidadala Rajini గుంటూరు వెస్ట్ లో సతమతం అవుతున్నారా?

మంత్రి విడదల రజిని(Vidadala Rajini) ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఆమెకు పరిస్థితులు అనుకూలించడం లేదా? స్థానిక వైసీపీ శ్రేణులు ఆమెకు సహకరించడం లేదా? ఆమె పునరాలోచనలో పడ్డారా? ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఆమె పరిస్థితి మారిందా?

ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే ఎన్నికల్లో తనకు దెబ్బ తప్పదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. తొలిసారి చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన ఆమె.. సిట్టింగ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పై విజయం సాధించారు. విస్తరణలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు.

కానీ ఇప్పుడు జగన్ ఆమెకు స్థానచలనం కల్పించడంతో.. కక్కలేక మింగలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సీఎం జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. కానీ బయట పెట్టలేని స్థితి ఆమెది. అయితే చిలకలూరిపేట టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి రజిని ఎలా ముందుకు వెళతారో చూడాలి.

See also  Repalle Constancy: రేపల్లె లో వైసిపి వ్యూహాత్మక ఎన్నికల ప్రచారం.. విజయం మనదేనంటూ టీడీపీ నత్త నడక!

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top