SV Krishna Reddy on Guntur Kaaram: ‘గుంటూరు కారం’ పై దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మైండ్ బ్లోయింగ్ కామెంట్…!

SV Krishna Reddy on Guntur Kaaram: ఎస్వీ కృష్ణారెడ్డి తన ఫ్లాపుల గురించి మాట్లాడుతూ.. రీసెంట్‌గా వచ్చిన గుంటూరు కారం గురించి నోరు విప్పాడు. ఎప్పుడైతే హీరోలకు తగ్గట్టుగా కథను నడిపిస్తామో.. అప్పుడే తేడా కొడుతుందన్న కృష్ణారెడ్డి.
Share the news
SV Krishna Reddy on Guntur Kaaram: ‘గుంటూరు కారం’ పై దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మైండ్ బ్లోయింగ్ కామెంట్…!

సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం సినిమా మీద ఎన్ని ట్రోల్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహేష్ బాబుని(Mahesh Babu) పక్కన పెడితే తన మార్క్ రైటింగ్ కనిపించలేదని అభిమానులు త్రివిక్రమ్ పై మండిపడ్డారు. అజ్ఞాతవాసి 2 అని యునానిమస్ గా కామెంట్ చేశారు.

ఇక అసలు విషయానికి వస్తే ఎస్వీ కృష్ణారెడ్డి(SV Krishna Reddy) 90వ దశకంలో తీసిన ఎన్నో చిత్రాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్స్‌గా నిలిచాయి. ఫ్యామిలీ కథలను ఎస్వీ కృష్ణా రెడ్డి తీయడం, రికార్డులు బద్దలు కొట్టడం అప్పుడు జరుగుతుండేది.

ఎస్వీ కృష్ణారెడ్డి(SV Krishna Reddy) కథను మాత్రమే పట్టుకుని తీసిన చిత్రాలు హిట్ అయ్యాయి. పెద్ద హీరో కదా? అని కథను పక్కనెట్టి.. హీరోకు తగ్గట్టుగా సినిమా తీస్తే ఫ్లాప్ అయ్యేవి… అలా బాలయ్య, నాగార్జునలతో ఎస్వీ కృష్ణా రెడ్డి తీసిన చిత్రాలు డిజాస్టర్లయ్యాయి.

బాలయ్యతో టాప్ హీరో అనే సినిమా, నాగార్జునతో వజ్రం అనే సినిమాలు తీసారు.. కానీ అది ఎస్వీ కృష్ణా రెడ్డి మార్క్ సినిమాల్లాగా అనిపించవు…

See also  Top 10 Most Viewed South Indian Actors in 2024: తస్సాదియ్యా ఆ యువ హీరో ప్రభాస్ ని దాటేసాడుగా!

కానీ శుభలగ్నం, మావిచిగురు, యమలీల వంటి చిత్రాలన్నీ కూడా కృష్ణా రెడ్డి మార్క్‌తోనే కనిపిస్తాయి. ఎప్పుడైతే స్టార్ హీరో కోసం కథను మల్చుతామో అప్పుడు రిజల్ట్ తేడా కొట్టే ప్రమాదం ఉందని కృష్ణా రెడ్డి ఒక వీడియోలో చెప్పుకొచ్చాడు.

SV Krishna Reddy on Guntur Kaaram

ఎస్వీ కృష్ణారెడ్డి తన ఫ్లాపుల గురించి మాట్లాడుతూ.. రీసెంట్‌గా వచ్చిన గుంటూరు కారం గురించి నోరు విప్పాడు. ఎప్పుడైతే హీరోలకు తగ్గట్టుగా కథను నడిపిస్తామో.. అప్పుడే తేడా కొడుతుంది.. ఇప్పుడు వచ్చిన గుంటూరుకారం చూడండి.. మహేష్ బాబు స్టార్డంకు తగ్గట్టుగా కథను నడిపించాలని త్రివిక్రమ్ కిందా మీదా పడిపోయారు.. అలా ఎప్పుడూ చేయకూడదు.. కథను బేస్ చేసుకుని సినిమాలు తీయాలి.. అందుకే యమలీల పెద్ద హిట్ అయిందంటూ ఎస్వీ కృష్ణా రెడ్డి చెప్పుకొచ్చాడు.

గుంటూరు కారం సినిమా చూసిన ప్రతీ ఒక్కరి ఫీలింగ్ దాదాపుగా ఇదే అయి ఉంటుంది. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గురూజీ చెప్పినట్టు మహేష్ బాబు 100% కాదు 200% శాతం ఇచ్చారు కానీ కథలో ఎమోషన్ మిస్ అయ్యేసరికి సినిమా హిట్ అవ్వలేదు…

See also  Guntur Kaaram Movie Review: గుంటూరు కారం - మహేష్ మాస్, తేలిపోయిన త్రివిక్రమ్ దర్శకత్వం..

ఈ చిత్రానికి మహేష్ బాబు ప్లస్ పాయింట్ అయితే.. త్రివిక్రమ్(Trivikram) మైనస్ పాయింట్ అంటూ ట్రోల్స్ కూడా జరిగాయి.. గతంలో ఖలేజా, అజ్ఞాతవాసి సినిమాల విషయంలో కూడా ఇదే జరిగింది అని పెద్దగా చెప్పనక్కర్లేదు…

ఇకపై త్రివిక్రమ్ తన స్టైల్ లోనే సినిమాలు తీస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది…

-By Pranav @ samacharnow.in

Also Read News

Scroll to Top