Yatra 2 Vs Raajadhani Files: పోటా పోటీగా విడుదలవతున్న యాత్ర 2 & రాజధాని ఫైల్స్.. రెండు రాజకీయ చిత్రాలే..

Yatra 2 Vs Raajadhani Files: యాత్ర 2, రాజధాని ఫైల్స్ రెండు రాజకీయ కధాంశంతో తీసిన చిత్రాలే. రెండు పోటా పోటీగా ఒక వారం తేడాతో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. వాటి కదా కమామిషు ఏమిటో చూద్దాం రండి
Share the news
Yatra 2 Vs Raajadhani Files: పోటా పోటీగా విడుదలవతున్న యాత్ర 2 & రాజధాని ఫైల్స్.. రెండు రాజకీయ చిత్రాలే..

యాత్ర 2, రాజధాని ఫైల్స్ రెండు రాజకీయ కధాంశంతో తీసిన చిత్రాలే. రెండు పోటా పోటీగా ఒక వారం తేడాతో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. వాటి కదా కమామిషు ఏమిటో చూద్దాం రండి..

Yatra 2 Vs Raajadhani Files – పోలికలు

ఈ రెండింటికి వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయన్నది closed సీక్రెట్ అని విశ్లేషకుల మాట. యాత్ర 2 ఫిబ్రవరి 8 న, రాజధాని ఫైల్స్ ఫిబ్రవరి 15న అంటే రెండు గురువారం నాడు రిలీజ్ అవబోతున్నాయి అన్న మాట. మాములుగా అయితే శుక్రవారం రావాలి, మరి గురువారం ఎందుకు చేస్తున్నారో. కనీసం హాలిడేస్ కూడా లేవు.

రెండు సినిమాలు తెలిసిన కధలే. సో సామాన్య ప్రేక్షకుడికి ఎక్సయిట్మెంట్ ఇచ్చే చిత్రాలు కావు. కాకపోతే రాజధాని ఫైల్స్ కి కొంచెం అడ్వాంటేజ్ ఉంది, కరెంటు ఇష్యూ & రేపు ఎన్నికలను ప్రభావితం చేసే అంశం కనుక. ఇక యాత్ర 2.. 2019 ముందు స్టోరీ.. సో outdated. పైగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తరువాత వుండే ప్రజా వ్యతిరేకత.

See also  Revenge killing: ప్రగతినగర్లో దారుణం.. యువకుడిని చంపి కత్తులు, రక్తం చేతులతోనే రీల్స్ చేసి ఇన్ స్టాలో పోస్ట్!

Yatra 2 Vs Raajadhani Files – తేడాలు

ట్రైలర్ ను బట్టి చూస్తే యాత్ర 2 నిర్మాణం విలువలు బాగున్నాయి. పెద్ద పెద్ద ఆర్టిస్టులున్నారు. ఇక రాజధాని ఫైల్స్ విషయానికి వస్తే నిర్మాణం విలువలు ఫర్వాలేదు. పెద్దగా ఫేమస్ ఆర్టిస్టులు లేరు.

యాత్ర 2 ట్రైలర్ విడుదలై 3 రోజులు దాటింది, 49 లక్షల వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంటే, ఇక రాజధాని ఫైల్స్ 20 గంటల్లోనే 62 లక్షల లక్షల వ్యూస్ తో టాప్ లో ట్రెండింగ్ అవుతుంది.

దీన్ని బట్టి చూస్తే రాజధాని ఫైల్స్ కే ఆదరణ ఎక్కువ ఉండవచ్చు రిలీజ్ అయిన తరువాత..ఇక ఈ Yatra 2 Vs Raajadhani Files లో ఎవరు విన్నారో ఫిబ్రవరి 15 తరువాతే తెలుస్తుంది..

ఇక Raajadhani Files సంబంధించి కొన్ని మెసేజ్ లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. వాటి సారంశమేంటంటే..

సీఎం ఇంటి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలోనూ, పాలెస్ పరిసరాల్లో తొంభై శాతం షూటింగ్ జరిగిందట!
విఫలమైన నిఘా వ్యవస్థ. రైతుల నిజ జీవితం పాత్రలతో కొత్త ప్రయోగం చేసారంట!
మూడు వేల మంది పోలీసుల పహారా కళ్ళు కప్పి షూటింగ్ ఎలా చేసుంటారు?
స్వతంత్ర సంగ్రామ ఘట్టాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా పత్రికల రహస్య ముద్రణ గుర్తుకు తెచ్చిన వైనంగా లేదూ?
నలుగురుని చేరితేనే ఊరంతా గుప్పుమనే కమ్యునికేషన్ ఉన్న ఈ రోజుల్లో మూడు వేల మంది పైగా పాల్గొన్న షూటింగ్, పోస్టర్ రిలీజ్ వరకూ ఎవ్వరికీ తెలియకుండా కప్పి పెట్టడం ఎలా సాధ్యం అయ్యింది?
రైతులకు వ్యతిరేకంగా జరిగిన దమనకాండ కు వ్యతిరేకంగా మూర్తి TV5 ఒక కామియోలో నటించాడట!

See also  Janhvi Kapoor: సూర్య నెక్స్ట్ మూవీ లో జాన్వి కపూర్?

ఇలా కొన్ని మెసేజ్ సర్క్యూలేట్ అవుతున్నాయి. వీటిల్లో ఎంత నిజమనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది..

Scroll to Top