CBN Delhi Tour to Meet BJP Leaders: రేపు ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో భేటీ.. పొత్తు పొడిచే ఛాన్స్!

Share the news
CBN Delhi Tour to Meet BJP Leaders: రేపు ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో భేటీ.. పొత్తు పొడిచే ఛాన్స్!

CBN Delhi Tour

ఏపీలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగబోతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తుంది. ప్రధానంగా పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ఈ టూర్ అని తెలుస్తుంది. బుధవారం రాత్రి ఆయన బీజేపీ ముఖ్యులతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల బోగట్టా.

టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తులతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. మరియు జనసేన, బీజేపీ మధ్య పొత్తు వున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టీడీపీ, జనసేన & బీజేపీ పొత్తు గురించే ఏపీలో చాలా చర్చలు జరుగుతున్నాయి. రేపటి సీబీన్ ఢిల్లీ టూర్(CBN Delhi Tour) తో బీజేపీ తో పొత్తుపై కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఓ పక్క టీడీపీ & జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ కూడా ఈ కూటమిలో చేరుతుందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఏ వైపు నుంచి అడుగు ముందుకు పడటం లేదు. టీడీపీ, బీజేపీ ఇద్దరు బిగుసుకుని కూర్చున్నాయి. ఇప్పుడు బాబు చొరవ చూపి ఢిల్లీ పెద్దలతో మాట్లాడటానికి వెళుతున్నారా, లేదా బీజేపీ నుంచి సిగ్నల్ వచ్చిన తరువాతే బాబు ఢిల్లీ టూర్(CBN Delhi Tour) కోసం బయలు దేరుతున్నారో అనేది తెలియ రాలేదు.

See also  Repalle Politics: వైసీపీ ఇంచార్జి మార్పుతో రసవత్తరంగా మారిన రేపల్లె రాజకీయం!

ఏది ఏమైనప్పటికి బీజేపీతో పొత్తు కుదిరితే 2014 result రిపీట్ అవడం దాదాపు ఖాయమే. ఇక బీజేపీకి ఏపీలో బలం లేకపోయినా సెంట్రల్ లో బలమైన పార్టీ. పైగా అధికారంలో వుంది. మరలా రాబోతుంది కూడా. సో బీజేపీతో పొత్తు వల్ల కూటమికి ఉపయోగమే, దాంతో అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి కూడా ఉపయోగమే.

ఇక పోతే చంద్రబాబు వెంట పవన్ కల్యాణ్ వెళ్లే అవకాశం ఉందంటున్నారు. రేపు కానీ క్లారిటీ రాదు. ఇద్దరు వెళితే మాత్రం పొత్తు ఫైనల్ చేకుని రావచ్చు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు, వైసీపీ గుండెల్లో కత్తే..

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top