
మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో తెలుగు వారికి తన నిజమైన పేరుతో కన్నా చిన్న నంబి గానే బాగా తెలుసు. నాని, కీర్తి సురేష్ కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ అయిన దసరా చిత్రంలో విలన్‌గా చాలా న్యాచురల్ గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు.
ఇక దసరా విలన్(Dasara Villain) మీద వచ్చిన మీమ్స్, ట్రోల్స్ ఎంత కామెడీగా ఉంటాయో మనందరికీ తెలుసు… సినిమాల్లో కరుడు కట్టిన విలన్ లా కనిపించే షైన్ తాం ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం ఎంతో ఫన్నీగా, సరదాగా ఉంటాడు. ఇప్పుడు అలాంటి ఒక ఫన్నీ వీడియో బాగా వైరల్ అవుతుంది… అదేంటో మీరు కూడా చూసేయండి….
ఏదో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో కెమెరాలు తనను ఫోకస్ చేస్తున్నాయని అనుకోలేదు టామ్. దీంతో జేబులో ఉన్న లైటర్‌ను అనుకోకుండా బయటకి తీసి, వామ్మో ఇది వచ్చిందేంటి? ఎవరైనా చూస్తారేమో అన్నట్టుగా వెంటనే లోపల పెట్టేశాడు. ఆ తరువాత మళ్లీ బయటకు తీసి తన పక్కనే ఉన్న చిన్న పాపను భయపెట్టాలని చూశాడు.
కానీ ఆ పాప మాత్రం తన తండ్రి మీదే ఫోకస్ పెట్టింది. ఆ లైటర్ గురించి అంతగా పట్టించుకోలేదు. చివరకు ఆ పాప తండ్రి భుజం మీద చేతులేసి లైటర్ వెలిగించడంతో పాప చూసి షాక్ అయింది.
ఇక ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కొందరు ఆ వీడియోని చూసుకుని నవ్వుకుంటున్నారు. విలన్ అంటే విలనే… పాపని కూడా భయపెడుతున్నావ్ కదరా… అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. గతంలో దసరా రిలీజ్ తర్వాత ఒక తెలుగు ఇంటర్వ్యూ వీడియో లో యాంకర్ ఫోన్ అడిగితే పైకి విసిరేసి వెళ్లి తెచ్చుకో అంటూ వైల్డ్ గా సమాధానం ఇచ్చినందుకు కూడా బాగా ట్రోల్స్ జరిగాయి…
2011 లో గడ్డమ అనే మళయాళ సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న షైన్ టామ్ చాకో(Dasara Villain) ఇప్పటివరకు తన కెరీర్ లో 50 కి పైగా సినిమాలు చేసాడు.. ప్రస్తుతం తెలుగులో దేవర సినిమాలో నటిస్తున్నారు. గతంలో దసరా, రంగబలి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
Dasara Villain Funny Video
Orai 😂😂😂😂 pic.twitter.com/dUltbxubb2
— Srinivas (@srinivasrtfan2) February 6, 2024
-By Pranav @ samacharnow.in