AP Cabinet Decisions: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాలు..

AP Cabinet Decisions: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ ను ఆమోదించిన కేబినెట్.
Share the news
AP Cabinet Decisions: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాలు..

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ ఉదయం రాష్ట్ర కేబినెట్ సమావేశమయింది. ఈ భేటీకి మంత్రులంతా హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు.

AP Cabinet Decisions

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ ను ఆమోదించిన కేబినెట్.

నంద్యాల జిల్లా డోన్ లో హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజి ఏర్పాటుకు ఆమోదం. వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీ కింద పని చేయనున్న పాలిటెక్నిక్ కాలేజీ.

డోన్ లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం. ఈ కాలేజీ ద్వారా వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమో కోర్సు. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ కింద పని చేయనున్న కాలేజీ.

అన్నమయ్య జిల్లాలో అన్నమాచార్య యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.

ఏపీ ప్రైవేట్ యూనివర్శిటీస్ యాక్ట్ 2016కి సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలో ఈ మూడు యూనివర్శిటీల ఏర్పాటుకు అనుమతి.

See also  Group-2 and SBI Clerk Exams issue: ఒకేరోజు గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ పరీక్షలు.. సమస్యను పరిష్కరించిన SBI..

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top