
NEET UG 2024 Notification
NEET UG 2024: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET (National Eligibility-cum-Entrance Test) కు సంబంధించిన నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 9న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.
నీట్ యూజీ ను మే 5న నిర్వహించనున్నట్లు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9 వరకు ఆన్‌లైన్ విధానంలో విద్యార్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని NTA వెబ్‌సైట్‌లో సమయానుకూలంగా వెల్లడించనున్నారు. NEET మే 5న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకు జరగనుంది.