TDP Shankaravam: చంద్రబాబు విజనరీ..జగన్ ప్రిజనరీ -కురుపాం శంఖారావం సభలో లోకేష్!

TDP Shankaravam: జగన్ ను చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది..కానీ చంద్రబాబును చూస్తే కియా కార్లు గుర్తొస్తాయి. చంద్రబాబు విజనరీ..జగన్ ప్రిజనరీ. చంద్రబాబు పేదలకోసం పిని చేస్తే..జగన్ పెత్తందారుల కోసం పని చేస్తున్నాడు- కురుపాం సభలో నారా లోకేష్.
Share the news
TDP Shankaravam: చంద్రబాబు విజనరీ..జగన్ ప్రిజనరీ -కురుపాం శంఖారావం సభలో లోకేష్!

TDP Shankaravam @Kurupam

పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర (North Andhra)..ఉద్యమాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. ఇక్కడి ప్రజల రకత్తంలోనే కష్టపడే తత్వం ఉంది. దేశంలో ఏ మూలకు వెళ్లినా ఉత్తరాంధ్ర వాసులు కనబడతారు. శ్రీ పైడితల్లి అమ్మవారు వెలిశారు. మన్యం వీరుడు అల్లూరి నడిచిన పుణ్యభూమి ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా. మంచి మనసుతో ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తాం..అలాంటి మంచిమనసున్నవారు ఉన్న గొప్పనేల ఉమ్మడి ఉమ్మడి విజయనగరం జిల్లా. ఉమ్మడి విజయనగరం జిల్లా వాసులకు రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇంత పవిత్రమైన భూమికి వచ్చి మీ ముందు నేను మాట్లాడటం అదృష్టం.

జగన్(Jagan) కు ఒక శాపం ఉంది..నిజం చెప్తే తన తల వెయ్యి ముక్కులు అవుతుంది. ఎన్నికల ముందు మహిళలకు అనేక హామీలిచ్చాడు. సంపూర్ణ మధ్య నిషేధం చేశాకే ఓట్లు అడుగతా అన్నాడు..మరి మధ్య నిషేధం చేశాడా.? అధికారంలోకి వచ్చాక 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు. యేటా 6 వేల పోలీస్ నియామకాలు చేస్తానన్నాడు..చేశాడా.?

అవేమీ చేయకపోగా టీడీపీ(TDP) ప్రభుత్వం తీసుకొచ్చిన అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ రద్దు చేశాడు. బీసీ విద్యార్థులకు కూడా స్టడీ సర్కిల్స్ రద్దు చేశాడు. విదేశీ విద్య, ఫీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి వాటిని కూడా రద్దు చేశాడు. జగన్ కూతుర్లు విదేశాల్లో చదవచ్చుకానీ, మన గిరిజన బిడ్డలు విదేశాల్లో చదవకూడదా.?

ఎన్నికలు రెండు నెలలు ముందు గ్రూప్ – 2 నోటిఫికేషన్ ఇచ్చాడు. అవికూడా…కేవలం 897 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తానని చెప్పాడు. ఈ 897 పోస్టులకు 5 లక్షల మంది పోటీ పడుతున్నారు. డీఎస్సీ పేరుతో మరో మోసం చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు 23 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని ఇప్పడు కేవలం 6,100 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ వదిలాడు. నిరుద్యోగులుకు కూడా హామీ ఇస్తున్నా… టీడీపీ-జనసేన(TDP-Janasena) ప్రభుత్వం వస్తుంది…యేటా జాబ్ కేలండర్ విడుదలు చేసి క్రమ పద్ధతిన ఉద్యోగాలు భర్తీ చేస్తాం.

See also  CBN Comments on Jagan: ఇంకొల్లు లో చంద్రబాబు కామెంట్స్

జగన్ ను చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు. కోట్లు ఖర్చు పెట్టి యాత్ర -2 సినిమా తీయించాడు. సొంత పార్టీ కార్యకర్తలే ఈ యాత్ర సినిమా వైసీపీకి అంతిమ యాత్ర అంటున్నారు. అర్జునుడు, అభిమన్యుడు అని బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. ఇతను సైకో..ఒక సద్దామ్ హుస్సేన్ లాంటి వాడు.

రోజుకో నాటకం..రోజుకో డ్రామా చేసే వ్యక్తి ఈ జగన్. వెయ్యి కోట్ల ఖర్చుపెట్టి సిద్ధం అని ప్లెక్సీలు వేస్తున్నాడు. దేనికి సిద్ధం..ఇసుకను బంగారం చేయడానికి సిద్ధమా.? ప్రజల్ని వేధించడానికి సిద్ధమా జగన్.? బూమ్ బూమ్, ప్రసెడింట్ మెడల్, ఆంధ్రాగోల్డ్ మద్యం ధరలు పెంచడానికి సిద్ధమా.?

జగన్ ను చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది..కానీ చంద్రబాబును చూస్తే కియా కార్లు గుర్తొస్తాయి. చంద్రబాబు విజనరీ..జగన్ ప్రిజనరీ. చంద్రబాబు పేదలకోసం పిని చేస్తే..జగన్ పెత్తందారుల కోసం పని చేస్తున్నాడు.

ఎక్కడ చూసినా మా నమ్మకం నువ్వే జగన్ అని బోర్డులు పెడతున్నాడు. సొంత చెల్లి, తల్లి నిన్ను నమ్మడం లేదు..నిన్ను మేమెందుకు నమ్మాలి.? ఎన్నికల్లో గెలవడానికి తల్లి చెల్లితో ప్రచారం చేయించుకుని…ఇప్పుడు ఇంటి నుండి గెంటేశాడు. షర్మిల, సునీత జగన్ నుండి ప్రాణహాని ఉందని డీజీపీకి లేఖ రాశారు. తల్లి, చెళ్లెల్లకు రక్షణ కల్పించలేనోడు రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పిస్తాడా.?

See also  Nirbhay Cruise Missile: నిర్భయ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం!

విద్యుత్ చార్జీలు 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు, ఇంటి పన్ను, చెత్తపన్ను, పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు పెంచారు. ఇంట్లో కుక్కకు కూడా పన్ను వేస్తాడు ఈ జగన్. ఎవర్నీ వదలకుకండా బాదుతున్నాడు. అన్న క్యాంటీన్, విదేశీ విద్య, పెన్షన్లు, రైతులకు డ్రిప్, సబ్సీడీలు కూడా రద్దు చేశాడు. దేశ చరిత్రలో 100 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఏకైక సీఎం ఈ సైకో జగన్.

చంద్రబాబు(Chandra Babu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కలిసి సూపర్ – 6(Super-6) ప్రకటించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నాం. ఉద్యోగం రాకపోతే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.

ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్. మూడు రాజధానులు పేరుతో మూడు ముక్కలాటలాడుతున్నాడు. ఇక్కడి యువకులను అడుగుతున్నా ఒక్క పరిశ్రమైనా ఉత్తరాంధ్రకు తీసుకొచ్చడా..ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడా.? ప్రజల నుండి పన్నుల ద్వారా డబ్బులు లాక్కుని రూ.500 కోట్లతో రుషికొండపై ప్యాలెస్ కట్టుకున్నాడు.
విశాఖ ఉక్కు..ఆంధ్రలు హక్కు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కానివ్వం…రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేలా చేస్తాం. అధికారంలెకి వచ్చాక విశాఖ రైల్వే జోన్ కు భూమి కేటాయిస్తాం.

విజయనగరం జిల్లాకు జగన్ 50 హామీలిచ్చాడు. భోగాపురం విమనాశ్రయం పూర్తి చేస్తానన్నాడు..రామతీర్థం ప్రాజెక్టూ పూర్తి చేస్తాన్నాడు. జంఝావతి-చంపావతి నదులు అనుసంధానం చేస్తానని చెప్పాడు. రామభద్రాపురంగడ్డ పూర్తి చేస్తానన్నాడు చేశాడా.? సాలూరు బైపాస్, పాలేరు నదిపై డ్యాం నిర్మిస్తాననన్నాడు…స్వర్ణముఖిచింతగడ్డపై బ్రిడ్జి నిర్మస్తానన్నాడు…చేశాడా..చేయలేదు.

See also  TSPSC Exam Results: టౌన్ ప్లానింగ్, డ్రగ్, హార్టికల్చర్, అగ్రికల్చర్ మొదలైన పోస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడి..

అందుకే జగన్ నిజం మాట్లాడితే తన తల వెయ్యి ముక్కలు అవుతంది. ఉమ్మడి విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది టీడీపీనే(TDP). పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చాం. భోగాపురం ఎయిర్ పోర్టుకు భూ సేకరణ, రోడ్లు, టిడ్కో ఇళ్లు, కాల్వల ఆధునీకరణ చేశాం. కురుపాంలో టీడీపీ గెలవకపోయినా వందల కోట్లతో అభివృద్ధి చేశాం. తోటపల్లి ప్రాజెక్టుకు రూ.450 కోట్లు కేటయించి సాగు, తాగు నీరు అందించాం.

ఔట్ సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్ పోస్టులు దాకా అన్నీ అమ్ముకుంటున్నారు. నాగావళి నది నుండి ఇసుక దోచుకుంటున్నారు. టీడీపీ(TDP) హయాంలో ట్రాక్టర్ ఇసుకు వెయ్యి ఉంటే ఇప్పడు రూ.5 వేలు అయింది. ఆర్ అండ్ బి, ఐటీడీఏ, ఉపాధి పనులు ఎమ్మెల్యే మరిది రమేష్ బాబు చూసుకుంటున్నాడు.

పుష్పశ్రీవాణికి మీరు రెండు సార్లు అవకాశం ఇచ్చారు..మీ జీవితాల్లో మార్పులు వచ్చాయా. గ్రామాల్లో ఏమైనా మార్పు వచ్చిందా..మీకు ఆదాయం పెరిగిందా.? వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన(TDP-Janasena) ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి.

గిరిజనుల గొంతును జగన్ కోసేశాడు. 16 సంక్షేమ పథకాలు గరిరిజనులకు రాకుండా రద్దు చేశాడు. టీడీపీ–జనసేన అభ్యర్థిని గెలిపిచండి మళ్లీ 16 పథకాలు అమలు చేస్తాం.

టీడీపీ(TDP) బలం కార్యకర్తలే. నాయకులు పార్టీ మారినా కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ప్రమాద బీమా అందించాం. వందకోట్లు ఖర్చు చేశాం.

మన నినాదం ఒక్కటే హలో ఏపీ…బైబై వైసీపీ

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top