Bharat Jodo Nyaya Yatra: ఆసుపత్రిలో చేరిన ప్రియాంక గాంధీ వాద్రా! భారత్ జోడో న్యాయ యాత్రకు డుమ్మా!

Bharat Jodo Nyaya Yatra: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అనారోగ్యం కారణంగా శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో జరిగే భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనలేరని తెలుస్తుంది.
Share the news
Bharat Jodo Nyaya Yatra: ఆసుపత్రిలో చేరిన ప్రియాంక గాంధీ వాద్రా! భారత్ జోడో న్యాయ యాత్రకు డుమ్మా!

Bharat Jodo Nyaya Yatra: ప్రియాంక గాంధీ వాద్రా డుమ్మా!

కాంగ్రెస్(Congress) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు, ఈ కారణంగా ఆమె శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyaya Yatra) చేయలేరని తెలుస్తుంది. ట్విటర్‌లో ప్రియాంక తాను అనారోగ్యానికి గురయ్యానని, కోలుకున్న తర్వాత యాత్రలో పాల్గొంటానని ప్రకటించారు.

కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. యాత్ర ప్రస్తుతం బీహార్ మీదుగా సాగుతోంది. బీహార్‌లోని ఔరంగాబాద్‌లో గురువారం జరిగిన మెగా ర్యాలీలో గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు.

శుక్రవారం సాయంత్రం, లోక్‌సభకు అత్యధిక సంఖ్యలో ఎంపీలను పంపే కీలకమైన హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో యాత్ర ఉంటుంది. ఇది ఫిబ్రవరి 16 నుండి 21 వరకు మరియు తరువాత ఫిబ్రవరి 24 నుండి 25 వరకు రాష్ట్రంలో ప్రయాణిస్తారు. ఫిబ్రవరి 22 మరియు 23 యాత్రకు విశ్రాంతి రోజులు అని కాంగ్రెస్ వెల్లడించింది.

See also  Mood of the Nation Modi 3.0: ముచ్చటగా మూడవ సారి మోడీ.. ఇండియా టుడే సర్వే

-By Kartik.K

Also Read News

Scroll to Top