RRB Technician 2024: నిరుద్యోగులకు శుభవార్త, 9,000 టెక్నీషియన్ Gr I సిగ్నల్ & Gr III ఉద్యోగాల కోసం నోటిఫికేషన్!

RRB Technician 2024: దేశవ్యాప్తంగా 21 రైల్వే రీజియన్లలో మొత్తం 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఫిబ్రవరి 17న నోటిఫికేషన్ విడుదల చేసింది.
Share the news
RRB Technician 2024: నిరుద్యోగులకు శుభవార్త, 9,000 టెక్నీషియన్ Gr I సిగ్నల్ & Gr III ఉద్యోగాల కోసం నోటిఫికేషన్!

RRB Technician 2024: 9,000 Technician Gr I Signal & Technician Gr III ఉద్యోగాల కోసం నోటిఫికేషన్!

దేశంలోని నిరుద్యోగ యువతకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 21 రైల్వే రీజియన్లలో ఖాళీలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఫిబ్రవరి 17న వివిధ విభాగాల్లో మొత్తం 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, జమ్మూ మరియు శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్, పాట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం మరియు గోరఖ్‌పూర్ రీజియన్‌లలో వున్న ఖాళీలను పూరించనున్నారు.

టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 9 నుంచి పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ సంబంధిత రైల్వే ప్రాంతాల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచబడుతుంది. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను మార్చి 9 నుండి ఏప్రిల్ 8 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించాలి. రాత, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక జరగనుంది. ప్రాంతాల వారీగా ఖాళీలు, విద్యార్హత, రాత పరీక్ష, సిలబస్ తదితర పూర్తి వివరాలను త్వరలో విడుదల చేయనున్నారు.

See also  Honor to Chiranjeevi in USA: అమెరికా లో అన్నయ్య చిరంజీవికి సన్మానం!

RRB Technician: ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.03.2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.04.2024

RRB Technician: అప్లికేషన్ మోడ్
ఆన్‌లైన్ ద్వారా మాత్రమే

ఖాళీ వివరాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 9,000.

టెక్నీషియన్ Gr I సిగ్నల్: 1,100 పోస్ట్‌లు
టెక్నీషియన్ Gr III: 7,900 పోస్ట్‌లు

RRB Technician: వయో పరిమితి
01.07.2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18-36 సంవత్సరాలు; టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18-33 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము
అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనార్టీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.

RRB అసిస్టెంట్ లోకో పైలట్ కూడా చూడండి: ITI మరియు డిప్లొమా అభ్యర్థులకు 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ALP) పోస్టులు

ఎంపిక ప్రక్రియ
CBT-1, CBT-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

See also  Political Biopics: NTR బయోపిక్ ల నిరాదరణ, టీడీపీ ఓటమి.. యాత్ర 2 నిరాదరణ, వైసీపీ ఓటమిని సూచిస్తుందా?

పే స్కేల్
టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు నెలకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 19,900.

మరిన్ని ఉద్యోగ వివరాల కొరకు: https://searchjob.in/

Also Read News

Scroll to Top