Annam Satish lashed out: బాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్..

Share the news
Annam Satish lashed out: బాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్..

Annam Satish lashed out on బాపట్ల ఎమ్మెల్యే రఘుపతి

పార్టీ సింబల్ లేకుండా మీరు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం. 25 వేల ఓట్ల మెజారిటీతో గెలవకపోతే చూడండి మరీ. బాపట్ల ఎమ్మెల్యే రఘుపతికి అన్నం సతీష్ సవాల్..

బాపట్ల(Bapatla) ఎమ్మెల్యే రఘుపతి(Raghupati) చేసిన అవినీతి మొత్తం ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకొస్తా… బాపట్లను నిలువునా దోచుకున్న తిన్న అవినీతి తిమింగలం రఘుపతి … ఎమ్మెల్యే చేతిలో మోసపోయిన కోనా బాధిత సంఘానికి ప్రభుత్వం మారిన వెంటనే న్యాయం చేస్తా… బాపట్ల చరిత్రలో ఇంత అవినీతి ఎమ్మెల్యేను ఎప్పుడూ చూడలేదు… అని బాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ అన్నం సతీష్.

క్విడ్ ప్రో కో ను రాష్ట్రంలో పరిచయం చేసిన వ్యక్తి కోనా ప్రభాకర రావు. రాజ్యాంగ పదవుల్లో అవినీతి చేసి మీ తండ్రి సస్పెండ్ అయిన మాట నిజం కాదా..? చనిపోయిన వ్యక్తిపై విమర్శలు చేస్తే బాగోదని ఇన్నేళ్ళు ఆగాను. బాపట్లను నేను, మా నాన్న మాత్రమే అభివృద్ధి చేశాం. ఇంకెవ్వరూ లేరనే మాయ మాటలు ఇప్పటికైనా మానండి..

See also  Janasena key decisions: అవనిగడ్డ అభ్యర్థిగా బుద్దప్రసాద్.. రైల్వేకోడూర్‌ అభ్యర్థి మార్పు!

రెండు సార్లు ఓడిపోయినా 3 వేల మంది పేదలకి ఉపాధి చూపించా. అన్నం సతీష్ ది పారిపోయే బ్లడ్ కాదు.. ప్రాణం ఉన్నంత వరకు బాపట్ల లోనే ఉండే బ్లడ్. ఒక్క మగాడు సతీష్. రఘుపతి అవినీతిని ప్రశ్నించే మగాడు సతీష్…!

నాగురించి బాపట్లలో అడుగు… నా ధైర్యం, మొడితనం ఏంటో ప్రజలు చెప్తారు…”కోనా” కుటుంబానికి “అన్నం” కుటుంబం చేసిన మేలు ఏంటో మీ పెద్ద అన్నయ్య గోవింద రాజులుని అడగండి. ఇక 15 రోజుల తర్వాత రఘుపతి మాట వినే వారు ఒక్కరు కూడా ఉండరు… ఖబడ్దార్ కోనా… ఇక కాస్కో… అంటూ మండిపడ్డారు అన్నం సతీష్

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top