
No Tickets to Strong Followers in YCP
ఎన్నికలకి ఇంకా రెండు నెలలే సమయం ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్(Jagan) ఇప్పటికే తన ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసి, లిస్టులను విడుదల చేసే పనిలో వున్నారు. సిట్టింగులకు టిక్కెట్లు నిరాకరిస్తూ, కొన్ని చోట్ల సొంత నియోజకవర్గాలు మారుస్తూ తీవ్రమైన గందరగోళానికి తెర తీశారు.
ఇదంతా ఒక ఎత్తైతే తననే నమ్ముకుని, నమ్మినబంటులగా వున్న వారికి కూడా టికెట్స్ నిరాకరించడం కార్యకర్తల్లోనే కాకుండా, ప్రజల్లో కూడా ఒక విధమైన చర్చకు దారి తీసింది. ఈ నమ్మిన బంటుల్లో ముఖ్యమైన వారుగా పొందిన రోజా, అమర్నాథ్, పేర్ని నాని, అంబటి, వంశి, కొడాలి నాని మొదలైన నమ్మకస్తులకు టికెట్ నిరాకరించడం(No Tickets to Believers) చూస్తే వాడుకుని వదిలివేయడమే కాదు వాళ్ళ రాజకీయ జీవితం పూర్తిగా నాశనం చేశారు. స్వామి భక్తికి ప్రతిఫలం..! అనుభవించక తప్పదుగా.
జగన్ మెప్పు పొందాలని వీళ్ళు ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులైన చంద్రబాబును(Chandra Babu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ను ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టడం, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల పై అవాకులు చెవాకులు పేలడం, ఆఖరికి ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా కామెంట్స్ చేయడం, ప్రశ్నించిన వారి మీద నోరేసుకుని పడిపోవడం చేసే వాళ్ళు. ఒకవిధంగా వాళ్ళ క్యారెక్టర్ ను వాళ్ళే నాశనం చేసుకున్నారు జగన్ కోసం. వ్రతం చెడినా ఫలితం దక్కనట్లు, ఇంత చేసినా ఇప్పుడు టికెట్ రాకపోవడంతో వీళ్ళ రాజకీయ జీవితానికి జగన్ తెర దించినట్లైంది. ఎందుకంటే వీళ్లకు వేరే పార్టీల్లోకి వెళ్ళడానికి అవకాశం కూడా లేదు మరి.
ఇక రీసెంట్ గా బూతుల బుచ్చయ్య గా పేరున్న నానికి గుడివాడ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తుంది. టికెట్ రాలేదన్న కోపమున్నా ఏమి చేయలేని పరిస్థితి, వేరే పార్టీల్లో కి మారలేని దుస్థితి పాపం వీళ్లది. దానికి కారణం జగనే అన్నది జనమెరిగిన సత్యం.
ఇలా నమ్మిన వాళ్ళను నట్టేట ముంచడం, మద్యనిషేధం, CPS మీద నాలుక మడతేయడం, మడం తిప్పడం, ఏపి ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచడం లాంటివి అనేకం. ఇన్ని చూసి కూడా మరలా గెలిపిస్తారా జగనన్నను జనం? ఏమో చూద్దాం!