Botsa Vs Ganta: టీడీపీ కొత్త ఎత్తుగడతో చీపురుపల్లి లో బొత్సా కు గంటా గండం!

Botsa Vs Ganta: ఏపీ లో రానున్న శాసన సభ ఎన్నికల్లో తాజా విద్యా శాఖ మంత్రైనా బొత్స తో మాజీ విద్యా శాఖ మంత్రైనా గంటా ఢీ కొట్ట బోతున్నారా?
Share the news
Botsa Vs Ganta: టీడీపీ కొత్త ఎత్తుగడతో చీపురుపల్లి లో బొత్సా కు గంటా గండం!

Botsa Vs Ganta

ఏపీ లో రానున్న శాసన సభ ఎన్నికల్లో చీపురుపల్లి(Cheepurupalli) అసెంబ్లీ నియోజకవర్గం లో తాజా విద్యా శాఖ మంత్రైనా బొత్స తో మాజీ విద్యా శాఖ మంత్రైనా గంటా ఢీ కొట్ట బోతున్నారా అంటే అవుననే అనిపిస్తుంది టీడీపీ(TDP) వర్గాల నుంచి వస్తున్నా సమాచారం బట్టి.

ఉత్తరాంధ్ర టీడీపీ కంచు కోటే కానీ గత ఎన్నికలల్లో కొంచెం దెబ్బతింది. ఇక వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి బొత్స ను ఢీ కొట్టాలి అంటే గంటా నే సరైన అభ్యర్థి అని టీడీపీ అధిష్ఠానం భావిస్తున్నట్లుగా వుంది. గంటా ఇప్పటి వరకు ఓడిందే లేదు. దీని పైన టీడీపీ అధిష్టానం లో విస్తృత చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ టైం బాగా లేక గంటా ఓడినా తరువాత MLC లేదా రాజ్యసభ ఆప్షన్ ఉండనే వుంది. ఒకవేళ Botsa Vs Ganta పోటీ ఖాయమైతే, ఇక బొత్స కు చీపురుపల్లి నుంచి బయటకు వెళ్ళడానికి టైం కూడా ఉండదు. టీడీపీకి ఇది మంచి ఎత్తుగడ అవుతుంది.

See also  Byjus Delayed Salaries: వరుసగా రెండో నెలా జీతాలు ఆలస్యం చేసిన బైజూస్!

ఇక బొత్స చీపురుపల్లి నుంచి నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు గెలిచారు. 2014 లో టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాళిని పై దాదాపు 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గంటా శ్రీనివాసరావు 2019 లో అనకాపల్లి నుంచి ఎంపీగా, తరువాత MLA గా 2004 లో రంపచోడవరం, 2009 లో అనకాపల్లి, 2014 లో భీమిలి, 2019 లో విశాఖ నార్త్ నుంచి గెలుస్తూ వచ్చారు. దాంతో మంచి ట్రాక్ రికార్డ్ వున్న గంటా నే బొత్స కు ధీటైన అభ్యర్థి అని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. టీడీపీ అంతర్గత సర్వేల్లోనూ అదే తేలినట్లు తెలుస్తుంది. సో Botsa Vs Ganta దాదాపు ఖాయమే

ఒకప్పుడు అంటే 1983 నుంచి 1999 వరకు అక్కడ టీడీపీకి ఎదురులేదు. తరువాత 2004, 2009 లో బొత్స కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014 లో టీడీపీ, మరల 2019 లో వైసీపీ నుంచి బొత్స గెలిచారు. మొత్తం మీద చూసుకుంటే అక్కడ ఆరు సార్లు టీడీపీ(TDP), రెండు సార్లు కాంగ్రెస్(Congress), ఒకసారి వైసీపీ(YCP) గెలిచింది.

See also  Modi Cabinet: మోడీ 3.0 మంత్రివర్గం ఇదే!

TDP NEW Strategy

Scroll to Top