![Devotees flocked to Medaram jatara: ప్రపంచం లోనే అతి పెద్ద గిరిజన జాతర కు పోటెత్తిన భక్తులు!](https://samacharnow.in/wp-content/uploads/2024/02/Medaram-jatara.webp)
భారీ సంఖ్యలో గద్దెల వద్దకు చేరుకుంటున్న భక్తులు . క్యూ లైన్లు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సింగరేణి రెస్క్యూ టీం ఆసుపత్రి కి తరలిస్తున్నారు. రోగులకు సకాలంలో వైద్యులు సేవలందిస్తున్నారు. ఇక భక్తులు క్రమ పద్ధతి పాటిస్తూ పోలీస్ సిబ్బందికి సహకరిస్తున్నారు.
ప్రపంచం లోనే అతి పెద్ద గిరిజన జాతరకు(Tribal Jatara) పోటెత్తిన భక్తులు. ఇక సారాలమ్మా రాక కి అన్నీ ఏర్పాట్లు పూర్తి. నేడు సాయింత్రం గద్దెలకు చేరుకోనున్న సారలమ్మ , పగిడిద్ద రాజు , గోవింద రాజులు. లక్మీపూరం నుండి మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు. గిరిజన సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలుకుతున్న స్థానికులు. తల్లల రాకకు ముస్తాబైన గద్దెల ప్రాంగణం. ఆలయ ప్రధాన ద్వారం వద్ద పూలతో ఏర్పాటు చేసిన అమ్మ వారి రూపం భక్తులను ఎంతో ఆకట్టుకుంటోంది. అమ్మవారి గద్దెల వద్ద రెవెన్యూ, ఎండోమెంట్, పోలీస్, ఫైర్, సింగరేణి రెస్క్యూ, ట్రాన్స్ కో, పంచాయతీ రాజ్ అధికారులు మూడు షిప్ట్లలో పనిచేస్తున్నారు.
అనారోగ్యం బారిన పడిన భక్తులను సింగరేణి రెస్క్కు టీం సకాలంలో స్పందించి వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు. గద్దెల పరిసరాలు క్యూ లైన్ల వద్ద 40 మంది రెస్క్కు టీం పనిచేస్తున్నారు. గద్దెల వద్ద భక్తులు సమర్పించే బంగారాన్ని సానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా 70 మంది సిబ్బంది రాత్రి పగలు పనిచేస్తున్నారు.
![](https://samacharnow.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-21-at-16.40.31_29f2aaa2-1024x768.jpg)
Medaram jatara లో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత
మేడారం జాతరలో(Medaram jatara) పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత. ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగిస్తున్న శానిటేషన్ సిబ్బంది. జాతరలో 4 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. మేడారం పరిసరాలతో పాటు భక్తులు దర్శనానికి వెళ్లే అన్ని సెక్టార్లలో పరిశుభ్రత పాటిస్తున్నారు. గద్దెల వద్ద 70 మంది శానిటేషన్ సిబ్బంది. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ గద్దెల వద్ద బెల్లం, భక్తులు సమర్పించే మొక్కులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.
– By Rambabu.C