Prabhas Kalki Movie Update: ప్రభాస్-దిశా పటానీపై సాంగ్ షూటింగ్ స్టార్ట్!

Share the news
Prabhas Kalki Movie Update: ప్రభాస్-దిశా పటానీపై సాంగ్ షూటింగ్ స్టార్ట్!

Prabhas Kalki Movie Update

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తాను సూపర్ హీరోగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్‌ కల్కి 2898 AD తో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Aswin) ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

అయితే ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో ప్రభాస్ – దిశా పటానీపై ఒక సాంగ్ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులతో పాటు గ్రాఫిక్స్ వర్క్ కూడా జరుగుతోంది. ఈ సంవత్సరం మే 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇంగ్లీష్‌లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకుండా ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని చిత్ర బృందం అనుకుంటుంది. అందుకే ఏకకాలంలో షూటింగ్, డబ్బింగ్, గ్రాఫిక్స్ పనలు పూర్తి చేస్తుంది.

See also  AMBEDKAR OPEN UNIVERSITY: అంబేద్కర్ వర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల

ఇక Prabhas Kalki సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతోంది. నైజాం ఏరియా రైట్స్ ఇప్పటికే రూ.75 కోట్లకు కోట్ అయినట్లు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమా రూ.200 కోట్లకి పైగా వసూళ్లు రాబడుతుందని చిత్ర బృందం అంచనా వేస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే ప్రభాస్ కెరీర్‌లోనే ఇది హయ్యెస్ట్ అవుతుంది. పైగా సలార్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ప్రభాస్ మరోసారి లైన్‌లో పడ్డాడు. దీంతో ఖచ్చితంగా కల్కి ఓపెనింగ్స్‌ భారీగా ఉంటాయి.

దీపికా పదుకొణె Prabhas Kalki సినిమాలో హీరొయిన్ గా చేస్తుంది అలాగే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి బిగ్గీస్ కూడా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు.

కల్కితో పాటు ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మరో రెండు చిత్రాలు ఉన్నాయి. డైరెక్టర్ మారుతితో ‘రాజాసాబ్’ అనే చిత్రం చేస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్రంలో డార్లింగ్ తరహాలో వింటేజ్ ప్రభాస్‌ను చూస్తారంటూ మారుతి చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఒక చిన్న టౌన్ లో జరిగే లవ్ స్టొరీ అన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది కాకుండా సలార్-2 కూడా ప్రభాస్ లైన్‌లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40 శాతం వరకూ పూర్తయినట్లు సమాచారం. మిగిలిన చిత్రీకరణ కూడా పూర్తి చేసి వీలైనంత త్వరగా సలార్ 2ను రిలీజ్ చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నారు.

See also  JEE Mains Admit Cards: 27-1-2024న JEE Mains Exam రాసే అభ్యర్థులకు హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన NTA!

-By Pranav @ samacharnow.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top