TS EAPCET 2024: టీఎస్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్స్ ల్లోకి ప్రవేశ పరీక్ష.. నోటిఫికేషన్ విడుదల!

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న TS EAPCET 2024 నోటిఫికేషన్‌ను JNTU -Hyderabad ఫిబ్రవరి 21న విడుదల చేసింది.
Share the news
TS EAPCET 2024: టీఎస్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్స్ ల్లోకి  ప్రవేశ పరీక్ష.. నోటిఫికేషన్ విడుదల!

TS EAPCET 2024 వివరాలు…

TS EAPCET 2024 Notification: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న TS EAPCET 2024 నోటిఫికేషన్‌ను జేఎన్టీయూ-హైద‌రాబాద్ ఫిబ్రవరి 21న విడుదల చేసింది. ఇకపోతే TS EAPCET 2024 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు ఏప్రిల్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 ఆల‌స్య రుసుమతో ఏప్రిల్ 9 వ‌ర‌కు, రూ.500 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 19 వ‌ర‌కు, రూ.5000 ఆల‌స్య రుసుముతో మే 4 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే ఏప్రిల్ 8 నుంచి 12 వరకు సరి చేసుకోవ‌చ్చు. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలోనే EWS అభ్యర్థులు త‌మ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 9 నుంచి 12 వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించబడతాయి . ఎగ్జామ్ కి సంబంధించిన హాల్‌ టికెట్లను విద్యార్థులు మే 1 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మే 9, 10 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగాలకు, మే 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు ప్రవేశ పరీక్ష జరగనుంది. ఆయా తేదీల్లో ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మొదటి సెషన్‌లో, మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించ‌నున్నారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉర్దూ మీడియం వారికి చివరి రోజు అయిన మే 12న పరీక్ష ఉంటుందని, వీరికి ఉర్దూ/ఇంగ్లిష్‌ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు.

See also  Telangana at Davos: తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయనున్న JSW Neo Energy

వివరాలు…

తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (TS EAPCET 2024)

ఇంజినీరింగ్ కోర్సులు: బీఈ/ బీటెక్‌, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (బయో-టెక్నాలజీ), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (ఎంపీసీ), ఫార్మ్-డి (ఎంపీసీ).

అగ్రికల్చర్ & ఫార్మసీ కోర్సులు: బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ(ఫారెస్ట్రీ), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ, బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (బైపీసీ), ఫార్మ్-డి (బైపీసీ),

అర్హత: ఇంటర్మీడియట్‌(ఎంపీసీ/ బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. అగ్రికల్చర్ సంబంధిత కోర్సులకు సంబంధించి డిప్లొమా చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

రిజిస్ట్రేషన్ ఫీజు: ఇంజినీరింగ్ (లేదా) అగ్రికల్చర్ & ఫార్మా పరీక్షల్లో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఇక రెండు విభాగాలకు (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.

See also  సమాచార పౌరసంబంధాల శాఖ నూతన ప్రత్యేక కమిషనర్‌(Commissioner)గా శ్రీ ఎం హనుమంత రావు

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్/ బయాలజీ నుంచి 80 ప్రశ్నలు- 80 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు.

పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్ (4 జోన్లు), నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

ముఖ్యమైన తేదీలు..

Descriptiondates
నోటిఫికేషన్ వెల్లడి21.02.2024.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం26.02.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది06.04.2024.
దరఖాస్తుల సవరణ08.04.2024 – 12.04.2024.
రూ.250 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది09.04.2024.
రూ.500 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది14.04.2024. 
రూ.2500 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది19.04.2024. 
రూ.5000 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది04.05.2024
పరీక్ష తేది09.05.2024 – 12.05.2024.

ముఖ్యమైన లింక్స్

See also  Adani Group to invest 12,400 crore in Telangana: రూ.12400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

Website 

Paper Notification

TS EAPCET 2024 నోటిఫికేషన్

Syllabus

Scroll to Top