
Is YSRCP getting troubles Before Elections? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైఎస్ఆర్‌సీపీలోని అలజడిని టీడీపీ, జనసేన అనుకూలంగా మలుచుకో గలవా? ఎన్నికలకు ముందు ఓ రాజకీయ పార్టీలో చేరికల్నిబట్టి ట్రెండ్ ఎలా వుందో ఒక అంచనా వేయవచ్చు. అది 2019 ఎలక్షన్స్ ముందు, మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా మనం చూసినదే. ప్రజల మూడ్ బట్టి రాజకీయ నాయుకులు పార్టీలు మారడం ఈ మధ్య సహజం అయిపొయింది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న నమ్మకంతో అన్ని రాజకీయ పార్టీలు కార్యకలాపాలు పెంచాయి కూడా.
Is YSRCP getting troubles Before Elections?
Yes, రాత్రికి రాత్రి పదకొండు స్థానాల్లో ఇంచార్జుల్ని మార్చడం వ్యూహాత్మకమో లేక వ్యూహాత్మక తప్పిదమో తెలియదు కానీ వైసీపీ పీకల్లోతు కష్టాల్లో మునిగినట్లు అయ్యింది. దీనితో వైసీపీ నాయకుల మీద వ్యతిరేకత అనేది నిజమని రుజువు అయినట్లయింది. ప్రతిపక్షాలు దీన్ని అంది పుచ్చుకున్నాయి. పైగా మార్చింది కేవలం 11 చోట్ల మాత్రమేనని, కానీ జాబితా వంద వరకూ ఉంటుందని సంకేతాలు పంపారు. ఇందులో పది మంది మంత్రుల పేర్లూ ప్రచారంలోకి వచ్చాయి. దీంతో అందరిలోనూ ఆందోళన ప్రారంభమయింది. అధికారికంగా టిక్కెట్ రాదని తెలిసిపోవడంతో వారి అనుచరులు రాజీనామాల బాట పట్టారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి జగన్ కు బాగా కావాల్సన వాళ్లు రాజీనామాలు చేశారు. మోపిదేవి వంటి మెతక వారు సైలెంట్ అయిపోయారు. కానీ వారి అనుచరులు మాత్రం రెచ్చి పోయి రాజీనామాల బాట పట్టారు. టిక్కెట్ రాదని కంగారు పడుతున్న నేతల సంఖ్య తక్కువేం లేదు. అలాంటి వారందరూ ఇప్పటికైతే సైలెంట్ గా ఉన్నారు. కానీ తెర వెనుక ప్రయత్నాలు చేసుకుంటూ ఉండవచ్చు. ప్రస్తుతం వైసీపీలో చేరికలు లేవు పైగా ఉన్నవారు రాజీనామా చేస్తున్నారు. మును ముందు వైసీపీలో చేరే వారు కూడా ఉండే అవకాశం లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక ఇంత మందిని తెలుగుదేశం, జనసేన పార్టీలు తీసుకున్నా కూడా కష్టమే. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత వున్న వారిని చేర్చుకుంటే మొదటికే మోసం వస్తుంది. అలోచించి తమ పార్టీల గెలుపుకు పనికి వచ్చేవారిని మాత్రమే తీసుకోవచ్చును. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఏపీ లో ప్రతిపక్షాలకు మంచి ఊపు వచ్చింది. అందుకే రోజు మార్చి రోజు ఆ పార్టీ కార్యాలయాలు సందడిగా మారుతున్నాయి. పార్టీలో చేరేందుకు వివిధ నియోజకవర్గాల నుంచి జిల్లాల వారీగా వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు వస్తున్నారు. గురువారం టీడీపీ , జనసేన కార్యాలయాల్లో జోరుగా చేరికలు జరిగాయి. కానీ మంగళగిరిలోని వైసీపీ కార్యాలయం ముందు మాత్రం ఎలాంటి సందడి లేదు. నిజానికి ఈ ద్వితీయ శ్రేణి నేతల్ని వారి గాడ్ ఫాదర్లే ముందస్తుగా.. టీడీపీ, జనసేన ,బీజేపీల్లో చేరమని ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారమూ ఉంది. ముందు ముందు ఈ చేరికలు మరింతగా జోరందుకోవచ్చు కూడా.
కాలం కలసి వచ్చినప్పుడు PK లాంటి వాళ్లు ఏ వ్యూహం వేసిన పని చేస్తుంది. అదే PK వేసిన వ్యూహం ఇప్పుడు బెడిసి కొడుతున్నట్టుంది. ఒక్క చాన్సు అని కాళ్లకు బలపం కట్టుకుని తిరిగిన జగన్కు అవకాశం ఇచ్చారు 151 మందిని గెలిపించి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా లాస్ట్ మినిట్ లో ఇలాంటి వ్యూహాలతో గెలవడం కష్టమే. ఉచిత పధకాలు ద్వారా కొంత ఓటు బ్యాంకు అయితే ఏర్పడింది కానీ తటస్థుల ఓటింగే ముఖ్యం ఇప్పుడు. డెవలప్మెంట్ లేదు, కనీసం రోడ్లు సరిగా వేయని అధికార పార్టీకి తటస్థులు మరలా ఓటు వేస్తారా అంటే డౌటే. చూద్దాం వచ్చే ఎలక్షన్స్ లో ఏమి జరగబోతుందో ఏపీలో