Varun Tej in Operation Valentine Promotions: పెద్దల మాటకి కట్టుబడి ఉంటా – వరుణ్ తేజ్ స్టేట్మెంట్ వైరల్!

Share the news
Varun Tej in Operation Valentine Promotions: పెద్దల మాటకి కట్టుబడి ఉంటా – వరుణ్ తేజ్ స్టేట్మెంట్ వైరల్!

ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. మార్చి 1న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోన్నసంగతి తెలిసిందే. బాలాకోట్ దాడులపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన ఆపరేషన్‌ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్‌లు సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ట్రైలర్ కాస్త మేజర్ టైపులో ఉన్నా వర్కవుట్ అవుతుందేమో అన్నట్టుగా కనిపిస్తుంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్(Varun Tej) రాజమండ్రిలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం నేట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఎంతో మెచ్యూర్డ్‌గా, సహనంగా సమాధానాలు ఇచ్చాడని సోషల్ మీడియాలో పొగడ్తలతో పోస్ట్లు నింపేస్తున్నారు. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఎలాంటి నిర్ణయమైనా కూడా కుటుంబం అంతా కలిసి తీసుకుంటుందని, వారి మాటే తామంతా వింటామని, పెద్దలు ఏం చెబితే అది చేస్తామని వరుణ్ తేజ్ చెప్పిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.

See also  Evergreen Classic Movie Malleeswari: "మల్లీశ్వరి" - NTR, Bhanumati జంటగా నటించిన అపురూప దృశ్యకావ్యం

జనసేన తరుపున ప్రచారం గురించి Varun Tej

చిరంజీవి(Chiranjeevi), నాగబాబు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీసుకునే సమష్టి నిర్ణయాలను తాము గౌరవిస్తామని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అన్నాడు. వచ్చే ఎన్నికల్లో జనసేన(Janasena) తరుపున ప్రచారం చేస్తారా? అని అడిగితే వరుణ్ తేజ్ నిజంగా ఆ అవసరం ఉందని బాబాయ్ భావిస్తే.. అందరూ కలిసి నిర్ణయిస్తే.. తాము ప్రచారం కోసం వస్తామని చెప్పుకొచ్చాడు.

ఏ విషయంలో అయినా సరే వారేం నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటామని అన్నారు. మా సపోర్ట్ ఎప్పుడూ బాబాయ్‌కి ఉంటుందని వరుణ్ తేజ్ చెప్పారు. అయితే రీసెంట్ గా నిహారిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందని చాలా రూమర్స్ వచ్చాయి. దాని గురించి అడిగితే అలాంటిదేమీ లేదని తీవ్రంగా ఖండించాడు వరుణ్ తేజ్. ఇప్పుడు పూర్తిగా తన సినిమాను ప్రమోట్ చేసుకునే బిజీలో ఉన్నాడు.

-By Pranav @ samacharnow.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top