
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ హాల్ టిక్కెట్లు 2024(AP Inter Hall Tickets 2024)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 1 నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు ఫిబ్రవరి 23 విడుదలయ్యాయి. ఎగ్జామ్స్ మార్చి 21 వరకు జరగనున్నాయి. ఈ సంవత్సరం మొత్తంగా 10 లక్షల పైగా విద్యార్థులు ఇంటర్ ఎగ్జామ్స్ రాయనున్నారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు SSC లేదా మొదటి ఏడాది హాల్‌టికెట్ నంబరుతో థియరీ పరీక్షల హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండో ఏడాది వారు మొదటి సంవత్సరం లేదా రెండో ఏడాది హాల్‌టికెట్ నంబరుతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.