
టీడీపీ(TDP) మరియు జనసేన(Janasena) మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో ఎవరు పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. ఇక బీజేపీ పొత్తులోకి వస్తే ఏ సీట్లు కేటాయించాలన్నదానిపైనా ఓ నిర్ణయానికి వచ్చారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ 24 అసెంబ్లీ , మూడు పార్లమెంట్ సీట్లల్లో పోటీ చేయనుంది. ఎక్కువ స్థానాల్లో పోటీ కన్నా ఖచ్చితంగా గెలిచే సీట్లలోనే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని పవన్ కల్యాణ్(Pavan kalyan) అన్నారు. అటు సీట్ల సర్దుబాటు పూర్తి అయ్యిందో లేదో వైసీపీ(YCP) వైపు నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. టీడీపీకి పార్టీని అమ్మేశారని ఒకరు.. విలీనం చేసి ఉపాధ్యక్ష పదవి తీసుకోవచ్చు కదా అని ఇంకొకరు విమర్శించడం ప్రారంభించారు. అయితే జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తే వైసీపీకి ఎందుకనే ప్రశ్న సహజంగానే ఎవరికైనా వస్తుంది. అంతగా బాధపడాలనుకుంటే.. జనసేన నేతలు బాధపడతారు. కానీ వైసీపీకి ఎందుకు ఆందోళన ? ఎందుకు కాపుల్లో(Kapu Community) చీలికకు ప్రయత్నం చేస్తున్నారు!
తక్కువ సీట్లు ఇచ్చారని జనసేన సైనికులను, కాపులను(Kapu Community) రెచ్చగొట్టి టీడీపీకి వ్యతిరేకం చేసే ప్లాన్ !
జనసేనకు తక్కువ సీట్లు ఇచ్చారని.. వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం.. ఇంతోటి దానికి పొత్తు కోసం ఎగబడటం ఎందుకు అని అనడం.. చూస్తుంటే దాని వెనుక ఒక స్ట్రాటజీ ఉన్నట్లు తెలుస్తుంది. తక్కువ స్థానాల్లో పోటీ అనేసరికి, జనసైనికుల్లో, కాపుల్లో(Kapu Community) కొంత వ్యతిరేఖత, కోపం వ్యక్తమైన మాట నిజమే. దాంతో వైసీపీ జనసైనికులను, కాపు సామాజిక వర్గాన్ని(Kapu Community) రెచ్చగొట్టి… పవన్ కల్యాణ్ ను అభిమానించే వారి ఓట్లను.. టీడీపీకి పడకుండా చేయడం ద్వారా తాము లబ్ది పొందాలని వైసీపీ ప్రయత్నం లా ఉందని రాజకీయ విశ్లేషకుల భావన.
పొత్తుల్లో ఎవరికైనా ఓట్ల బదలాయింపు కీలకం. జనసేన కేడర్ లో టీడీపీ పార్టీ పై వ్యతిరేక త పెంచడం ద్వారా.. ఓట్లు బదిలీ జరగకుండా చూస్తే అది తమకే ప్లస్ అవుతుందని వైసీపీ వర్గాలు అంచనా అని రాజకీయ విశ్లేషకుల భావన. అందుకే జనసేన ఫ్యాన్స్ ను.. టీడీపీపై రెచ్చగొట్టేందుకే ఈ తరహా విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేస్తే ఆయా సీట్లల్లో సులువుగా గెలవొచ్చని వైసీపీ ప్లాన్ ?
జనసేన ఎక్కువ సీట్లు తీసుకుంటే.. వైసీపీకే ఎక్కువ లాభమన్న అంచనాలు ఉన్నాయి. పెద్దగా బలం లేని చోట కూడా పోటీపడి సీటును తీసుకోవడం వల్ల ఆ అభ్యర్థిని సునాయసంగా ఓడించవచ్చని వైసీపీ ప్లాన్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. పొత్తుల్లో ఉన్న పార్టీలు.. వాటికి సంబంధించిన ఓటు బ్యాంకుల మధ్య సానుకూలత ఉంటే.. ఏమీ చేయలేరు. కానీ.. అలాంటి పరిస్థితి లేకపోతే.. బలహీనంగా ఉన్న పార్టీ పోటీ చేస్తే.. ప్రత్యర్థి సలువుగా గెలుచుకోలగరు. జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని వైసీపీ ఈ కారణంగానే కోరుకుందన్న వాదన కూడా వినిపిస్తోంది. అందుకనే వైసీపీ జనసైనికుల్లో, కాపు సామాజిక వర్గంలో(Kapu Community) చీలికకు ప్రయత్నం చేస్తుండ వచ్చని అనుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్, జనసేనపై విమర్శలు వైసీపీకే మిస్ ఫైర్ అయ్యే అవకాశం!
పొత్తుల విషయంలో పవన్ పై వైసీపీ నేతలు , మంత్రులు చేస్తున్న విమర్శలు ఆ పార్టీకి మిస్ ఫైర్ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో పెద్దగా జనసేనతో సంబంధం లేని వారు కూడా .. తాము జనసేనకు ఓటు వేస్తామని.. టీడీపీకి ఓటు వేయమని ప్రచారం చేపిస్తున్నారు. ఇదంతా.. ఎన్నికల స్ట్రాటజీ . పవన్ కళ్యాణ్ ని వ్యక్తి గతంగా టార్గెట్ చేసిన వైసీపీ ని ఎలాగైనా ఓడించాలి అనుకునే నిజమైన జనసేన ఓటర్లు మాత్రం.. ఈ సారి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ బలమైన పాత్ర పోషిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే.. జనసేన కు అండగా ఉండే వర్గాలన్నీ.. ఈ సారి కూటమిని దాటి పోవని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
చూద్దాం ఏం జరగనుందో.. రాష్ట్ర శ్రేయస్సు కొరకు త్యాగం చేసి తాను తక్కువ సీట్లకు అంగీకరించాను అని అంటున్న పవన్ కళ్యాణ్ పై సామాన్య ఓటర్లకు సానుభూతి వస్తే మాత్రం ఇక జనసేనకు తిరుగుండదు, ఓటర్లు 2029 ఎన్నికల్లో పవన్ కు, జనసేన కు ఇంకా పెద్ద బాధ్యతను ఇచ్చినా ఆశ్యర్య పోనవసరం లేదు కూడా.