TS BJP: 6 MP స్థానాలకు బీజేపీ అభ్యర్థులు.. తెలంగాణా లో త్వరగా.. మరి ఆంధ్రా లో ఆలస్యమెందుకో?

Share the news
TS BJP: 6 MP స్థానాలకు బీజేపీ అభ్యర్థులు.. తెలంగాణా లో త్వరగా.. మరి ఆంధ్రా లో ఆలస్యమెందుకో?

ఆరుగురు MP అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేసిన TS BJP

TS BJP: లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ(BJP) తెలంగాణ లో చక చకా సిద్ధమవుతోంది. ఆరుగురు అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేసింది. అయితే తోలి జాబితా లో సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపూరావు పేరు లేదు. మిగతా ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలకు ఈసారి కూడా టికెట్లు ఖరారయ్యాయి. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌‌కు మరోసారి అవకాశం ఇచ్చింది.

ఇక తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలుండగా.. మొదటి జాబితాలో 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ అధిష్ఠానం.. మరో 11 స్థానాల్లో కూడా పలువురి అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది. ఇందుకోసం.. ఒక్కో సీటుకు రెండేసి పేర్లతో.. మరో జాబితాను జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకటించిన ఆరుగురు అభ్యర్థుల్లో కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌ నుంచి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అరవింద్ మరోసారి బీజేపీ ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. వీళ్లతో పాటు చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్‌కు బీజేపీ అధిష్ఠానం టికెట్లు ఖరారులు చేసింది.

See also  Seat-Sharing Talks: చివరి దశకు చేరిన సీట్ల పంపకాల చర్చలు.. 10 ఎంపీల సీట్ల కోసం బీజేపీ బేరం..

TS BJP ఇలా దూకుడుగా ఉంటే, ఇంకో పక్క ఏపీ లో మాత్రం బీజేపీ మీనమేషాలు లెక్కపెడుతుంది. ఒక పక్క మిత్రులు మొన్న శనివారం 118 సీట్లకు గాను టీడీపీ 94, జనసేన 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి మంచి దూకుడు మీద ఉన్నారు. ఉమ్మడి సభ జరపడానికి కూడా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. బీజేపీ మాత్రం ఏసంగతి తేల్చకుండా నాన్చడం ఎందుకో విశ్లేషకులకు కూడా అంతు పట్టడం లేదు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top