![India Vs England 4th Test: ఇంగ్లండ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో సూపర్బ్ విక్టరీ.. సిరీస్ కైవసం..](https://samacharnow.in/wp-content/uploads/2024/02/India-Vs-England-4th-Test.webp)
India Vs England 4th Test
రాంచీ(Ranchi) టెస్టులో నాలుగో రోజు ఇంగ్లండ్(England) జట్టుపై టీమిండియా(Team India) 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగుల ఆధిక్యం పొందిన తరువాత, ఇంగ్లాండ్ తమ రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 145 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దాంతో మూడవ రోజున ఇంగ్లాండ్ టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినట్లయింది. ఆ క్రమంలో భారత్ నాలుగో రోజు ఐదు వికెట్ల నష్టానికి టార్గెట్ పూర్తి చేసింది. దీంతో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 3-1 ఆధిక్యంలో ఉంది.
మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ వరకు ఇంగ్లండ్ జట్టు ముందుంది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్(5 వికెట్లు ) మరియు కులదీప్ యాదవ్(4 వికెట్లు) స్పిన్ దెబ్బకి ఇంగ్లాండ్ గింగరాలు తిరిగి కేవలం 145 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో మూడో రోజే 2 ఇన్నింగ్ ప్రారంభించిన భారత్ 40/0 పరుగులు చేసింది. అయితే నాలుగో రోజు మాత్రం వరుసగా వికెట్లు కోల్పోతూ, ఒకానొక దశలో 120/5 తో విజయం కష్టమా అనిపించింది. ఆ టైం లో మొదటి ఇన్నింగ్ హీరో ధృవ్ జురెల్ మరల కీ రోల్ పోషించాడు గిల్ తో కలసి. వీళ్లిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ భారత్‌ను విజయ తీరాలకు చేర్చారు
రాంచీ(ranchi)లో ముందుగా బౌలింగ్ చేసి టెస్టుల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. రాంచీ టెస్టులో భారత్ గెలవడం ద్వారా 5 టెస్టుల సిరీస్‌ను మాత్రమే కాకుండా, ఈ వేదికపై ఆడిన 3 టెస్టుల్లో ఇది రెండో విజయం. ఇంతకు ముందు ఆడిన రెండు టెస్టుల్లో ఒకటి విజయం సాధించగా, మరొకటి డ్రాగా ముగిసింది.
India Vs England 4th Test ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: ధృవ్ జురెల్(Dhruv Jurel). మొదటి ఇన్నింగ్స్ లో 90, రెండో ఇన్నింగ్స్ లో 39 నాట్ అవుట్