Rashmika Mandanna: జపాన్‌ లో రష్మిక మందన

రష్మిక మందన(Rashmika Mandanna) ప్రస్తుతం జపాన్‌(Japan) లో ఉంది. టోక్యో కాలింగ్ అంటూ ఫ్లైట్‌లో ఎక్కి ఫొటోస్ పోస్ట్ చేసింది.
Share the news

జపాన్‌ లో Rashmika Mandanna

Rashmika Mandanna: జపాన్‌ లో రష్మిక మందన

రష్మిక మందన(Rashmika Mandanna) ప్రస్తుతం జపాన్‌(Japan) లో ఉంది. టోక్యో కాలింగ్ అంటూ ఫ్లైట్‌లో ఎక్కి ఫొటోస్ పోస్ట్ చేసింది. అయితే రష్మిక మందన ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. రష్మిక ఇంత బిజీలోనూ టోక్యోకి వెళ్తుంది అంటే అది చాలా ముఖ్యమైన పని అని చెప్పాల్సిన పని లేదు. ఎందుకు వెళ్తుంది అనే విషయానికి వస్తే షూటింగ్ కోసం మాత్రం కాదనే చెప్పాలి. క్రంచీ రోల్ యానిమీ అవార్డును తీసుకునేందుకు రష్మిక అక్కడికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అవార్డుల కోసం మన దేశం నుంచి తొలిసారిగా రష్మిక అక్కడకు వెళ్తోంది.

రష్మిక ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉంది. ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాను చేస్తుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీని ఆపేస్తున్నారంటూ, ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందంటూ మధ్యలో కొన్ని రూమర్లు వచ్చాయి. కానీ ఈ మూవీ ఇంకా సెట్స్ మీదుంది. ఇక ఈ మూవీ తరువాత రష్మిక యానిమల్ పార్ట్ 2, పుష్ప పార్ట్ 2(Pushpa Part 2) షూటింగ్‌లతో బిజీగా కానుంది. ఇప్పటికే పుష్ప ది రూల్ సినిమా కోసం రష్మిక చాలా డేట్స్ కేటాయించింది. ఇంకా ఆలస్యం అవుతుండటంతో ఇలా మధ్యలో వేరే చిత్రాలను చేస్తూ బిజీగా గడిపేస్తోంది.

See also  Chiranjeevi Meets Telangana CM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి

-By Pranav @ samacharnow.in

Also Read News

Scroll to Top