
Prabhas Movie Updates
పాన్ ఇండియా స్టార్ గా నేషనల్ వైడ్ ఫెమ్ సంపాదించిన ప్రభాస్ ప్రస్తుతం పవర్ఫుల్ సినిమాలతో సిద్ధమవుతున్నాడు. ఇదువరకెప్పుడూ లేనంత బిజీగా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఒకవేళ ఏ డైరెక్టర్ అయినా ప్రభాస్ తో సినిమా చేయాలంటే ఖచ్చితంగా మూడు సంవత్సరాల వరకు ఆగాల్సిందే అని తెలుస్తుంది. దాదాపు 6 సినిమాలు ఇప్పుడు అయన లైన్ లో ఉన్నాయి.
ఇవే కాకుండా మరికొన్ని కథలపై డిస్కషన్స్ జరుగుతున్నాయట వాటిపై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాల వివరాల్లోకి వెళితే.. కల్కి మొదటి భాగం త్వరలో రాబోతోంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని వైజయంతి మూవీస్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాపై ఉన్న బజ్ అంతా ఇంతా కాదు.
Prabhas Movie Updates: రాజాసాబ్ సినిమా
ఇక లిస్టులో రెండవది మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమా ఉంది. ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే ఏడాది చివర్లో విడుదల చేయాలని ఆలోచనతో ఉన్నారని తెలుస్తుంది. రాజాసాబ్ సినిమా హర్రర్ కామెడి బ్యాక్ డ్రాప్ లో ఒక టౌన్ లో జరిగే కథగా రాబోతుంది.
ఆ తరువాత రాబోయే స్పిరిట్ పై అంచనాలు మూవీ టీం నుండి ఏ అప్డేట్ రాకపోయినా ఒక రేంజ్ లో ఉన్నయనే చెప్పాలి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. మొదటిసారి పోలీస్ పాత్రలో ఏ విధంగా కనిపిస్తాడా అని ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
అలాగే సీతారామం దర్శకుడు హను రాఘవపూడి తో కూడా ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వకపోయినా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా సీతారామం లాగానే వార్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా తెరపైకి రానుంది.
Prabhas Movie Updates: ఆ సినిమాలకి రెండు పార్ట్ లు
ఇక సలార్ సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలవుతుంది అని ఆ మధ్య కొన్ని గాసిప్స్ అయితే వచ్చాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే సెకండ్ పార్ట్ కు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ కూడా షూట్ చేశాడు. ఈ ప్రాజెక్టును ప్రభాస్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆలోచనతో ఉన్నాడని, సపరేట్ గా డేట్లు ఇస్తానని ప్రశాంత్ నీల్ తో చెప్పాడని గుసగుసలు వినిపించాయి.
కల్కి 2898 AD రిలీజ్ తర్వాత దానికి పార్ట్ 2 కూడా ఉంటుందని ఇదువరకే నాగ అశ్విన్ ఇదువరకే చెప్పారు. ఫస్ట్ పార్ట్ విడుదలైన తరువాత మిగతా సినిమాలతో బిజీ కాబోతున్న ప్రభాస్ ఏడాది అనంతరం రెండో భాగంకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేయనున్నాడు. ఈ విధంగా ప్రభాస్ వచ్చే మూడేళ్ళ వరకు ఆరు సినిమాలను లైన్లో పెట్టాడు. మరి ఈ సినిమాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయో లేదో చూడాలి.
-By Pranav @ samacharnow.in