Abolition of One Minute Delay Rule: ఆ దరిద్రపు నిబంధనను ఎత్తివేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు..

మొత్తానికి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను(One Minute Delay Rule) తొలగించింది. ఇకపై 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.
Share the news
Abolition of One Minute Delay Rule:  ఆ దరిద్రపు నిబంధనను ఎత్తివేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు..

One Minute Delay Rule రద్దు

ఎట్టకేలకు తెలంగాణ ఇంటర్ బోర్డు((Inter Board) కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించింది. ఇకపై 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన(One Minute Delay Rule ) వల్ల కొంత మంది పరీక్ష రాయలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా వున్నాయి. దాంతో ఎంతో మంది ఈ నిబంధనను రద్దు చేయమని డిమాండ్ చేశారు. అయినా కూడా ఇంటర్ బోర్డు ఆ నిబంధనను రద్దు చేయలేదు.

ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత బోర్డు మంచి నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులకు ఐదు నిమిషాలు గ్రేస్ టైమ్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం లేట్ అయినా విద్యార్థులు పరీక్ష రాయడానికి అధికారులు అనుమతించడం లేదు. తాజా నిర్ణయంతో విద్యార్థులకు కాస్త వెసులుబాటు కలిగినట్లే.

See also  Devotees flocked to Medaram jatara: ప్రపంచం లోనే అతి పెద్ద గిరిజన జాతర కు పోటెత్తిన భక్తులు!

సూసైడ్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఒక్క నిమిషం నిబంధనను ఎత్తివేసినట్లు సమాచారం. అయితే.. విద్యార్థులు మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని, సమయానికే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read News

Scroll to Top