
Anant Ambani pre wedding ceremony
బిజినెస్ టైకూన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) చిన్న కొడుకు వివాహానికి మెగా కపుల్ కు ఆహ్వానం అందినట్లుగా గత రెండు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వాటిని నిజం చేస్తూ గుజరాత్ జామ్ నగర్ లో జరిగిన అనంత్ అంబానీ – రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో రామ్ చరణ్(Ram Charan) – ఉపాసన(Upasana) దంపతులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాయి.
Mega power couple, #RamCharan and #Upasana steal the spotlight at Ambani's pre-wedding bash with their star power as the only couple from the south industry ❤️🔥@AlwaysRamCharan @UpasanaKonidela#GlobalStarRamCharan #RC16 pic.twitter.com/rVgr3eiatL
— Ravi Teja (@RaviTejaChiru) March 1, 2024
ఇక వీరితో పాటుగా షారుఖ్ ఖాన్ దంపతులు, అమీర్ ఖాన్, అనిల్ కపూర్, సోనమ్ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, సైఫ్ అలీఖాన్, అజయ్ దేవగణ్, మాధురీ దీక్షిత్, శ్రద్ధా కపూర్, దిశా పటానీ లాంటి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు Anant Ambani pre wedding వేడుకలకు హాజరయ్యారు.
అయితే వీరిద్దరూ శుక్రవారం అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసం స్పెషల్ ఫ్లైట్ లో గుజరాత్ వెళుతున్న సందర్భంగా విమానంలో నిద్ర పోతున్న తన భార్య కాళ్ళు నొక్కుతూ కనిపించారు చెర్రీ. దీన్ని తమ కెమెరాలో బంధించిన సన్నిహితులు, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కూడా వైరల్ అయింది.
— TeamUpasana (@TeamUpasana) March 1, 2024